రుణమాఫీపై రోజుకో మాట ఎందుకో?
కార్వేటినగరం: అధికార దాహంతో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పు డు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షు డు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే. నారాయణస్వామి విమర్శించారు. కార్వేటినగరంలో సోమవారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ రైతు ల రుణాలు, డ్వాక్రా రుణాలను మా ఫీ చేస్తామనడంతో రైతులు, మహిళలు మోసపోయి ఓట్లు వేశారని, అధికారం వచ్చాక చంద్రబాబు రోజుకో మాటచెబుతూ మభ్యపెడుతున్నారన్నారు.
ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామనడంతో టీ డీపీని ఆదరించిన పాపానికి ఉన్న ఉద్యోగాలను తొలగించి యువతను వీధి పాలు చేయడం సమంజసం కాదన్నారు. మాట నిలపెట్టుకోలేని ముఖ్యమంత్రిపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలి పారు. రుణమాఫీ చేస్తే జీవో ఎందు కు రాలేదు.. బ్యాంకర్లు రైతులకు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు.. డ్వాక్రా రుణాలు చెల్లించాలని మహిళలను ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
రుణాలు చెల్లించాలని నోటీసులు అందడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైందన్నారు. తాగునీరు, కరెంటు కోతలతో ప్రజ లు అల్లాడుతున్నారని తెలిపారు. నాయకులు కుప్పారెడ్డి, గోవిందస్వామి, మోహన్‌రెడ్డి, జయరాం, సుబ్రమణ్యం రెడ్డి, విజయలురెడ్డి, సుబ్రమణ్యం,రాధాకృష్ణ, మురళీ, భాషా, శంకర్, కన్నాయరం పాల్గొన్నారు.