ఆస్పత్రిలో చేరిన శశికపూర్
ముంబై: ఒకప్పటి బాలీవుడ్ హీరో శశికపూర్ ఛాతిలో ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా ఆస్పత్రిలో చేరారు. శ్వాస ఆడక ఇబ్బందిపడుతూ 76 ఏళ్ల శశికపూర్ నిన్న సాయంత్రం కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ అస్పత్రి(కెడిఏహెచ్)లో చేరారు. ఇన్టెన్సివ్ కేర్ యూనిట్(ఐసియు)లో ఆయనకు చికిత్స చేస్తున్నట్లు ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామ్ నరెయిన్ చెప్పారు. శశికపూర్ ఆరోగ్యం స్థిమితంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
దాదాపు 160 చిత్రాలలో నటించిన శశికపూర్ మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. 2010లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచ్ఛీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఆయనకు గతంలో బైపాస్ సర్జరీ చేశారు.
**