సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
బాలాజీనగర్(రేణిగుంట): గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ పంచాయతీల వారీగా అనుబంధ గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తామని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామితో కలసి రేణిగుంట మండలం కేఎల్ఎం హాస్పిటల్ సమీపంలోని బాలాజీనగర్‌లో పర్యటించారు.
గాజులమండ్యం సర్పం చ్ శ్రీరాజ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ సర్పంచ్ల సహకారంతో ఐదేళ్లలో అన్నివిధాలా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి కుటుంబానికి రుణిపడి ఉంటానన్నారు. నాయకులు, కార్యకర్తలను కాపాడే బాధ్యత తనదేనన్నారు.
తిరుపతి(రేణిగుంట) విమానాశ్రయం విస్తరణ పనులు ఏడాది లోపు పూ ర్తయ్యేలా కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజును కోరామన్నారు. విదేశాలకు విమాన సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామన్నారు. మన్నవ రం ప్రాజెక్టును ఉత్పత్తి స్థాయికి తీసుకొచ్చేం దుకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పొన్ను రాధాకృష్ణన్‌తో చర్చించామన్నారు. ఎస్ఎస్ కెనాల్, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందించేలా పోరాడతామని ఆయ న పేర్కొన్నారు.
ప్రజలతో మమేకమై సేవ చేస్తా
ప్రజలకు మేలు చేసేందుకు వారితో మమేకమై పార్టీలకతీతంగా సేవ చేస్తామని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నా రు. నిస్వార్ధంగా సేవ చేసే మంచి నాయకుడి ని తిరుపతి ఎంపీగా ఎన్నుకున్నారని ప్రజల ను అభినందించారు. మాజీ ఎంపీ చింతామోహన్ చివరలో సర్పంచులకు వీధిలైట్లు ఇచ్చి మోసం చేశారే తప్ప అభివృద్ధి అంటే ఏమిటో ఆయని ఎరుగడని విమర్శించారు. ఎస్సీల ఇళ్లలో మంచినీళ్లు కూడా తాగడానికి ఆయనకు ఇష్టం ఉండదన్నారు.
జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కులాలు, పార్టీలను చూసి పాలన చేయడం మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను షరతులు, కమిషన్లు ఏర్పాటు చేయకుండా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, ఎమ్మెల్యే నారాయణస్వామిని గాజులమండ్యం సర్పంచ్ శ్రీరాజ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ బీరేంద్రవర్మ, ఎలమండ్యం సర్పంచ్ చిన్నికృష్ణయ్య, నాయకులు మోహన్, స్థానికులు, వార్డుమెంబర్లు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.