అన్నాడీఎంకే నేత అరెస్టు
కెలమంగలం: కెలమంగలం పోలీస్‌స్టేషన్‌లో పోలీసు విధులను అడ్డుకున్న అన్నాడీఎంకే కెలమంగలం పట్టణ కార్యదర్శి మురుగన్(48)ను అరెస్టు చేశారు.
ఆదివారం సాయంత్రం మద్యం తాగి పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీకి వెళ్లిన మురుగన్ పోలీసులపై గొడవకు దిగి విధులను అడ్డుకొన్నాడు. ఎస్.ఐ.ఆనంద్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.