నీ హృదయం... దయా సముద్రం!
మగానుభావులు
అమెరికన్స్‌కు ‘చైనీస్ ఫుడ్’లోని మజాని పరిచయం చేశాడు కెన్ హమ్. సెలబ్రిటీ చెఫ్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన కెన్ ఎంతో డబ్బు సంపాదించాడు. ఏ పనీ చేయకుండా కాలు మీద కాలేసుకొని సుఖించేంత సంపద ఉంది. అయితే కెన్ మాత్రం అలా కోరుకోవడం లేదు. తన యావత్ సంపదను దానధర్మాలకు వినియోగించాలనుకుంటున్నాడు.
అరవై నాలుగు సంవత్సరాల ఈ మాజీ బిబిసి స్టార్ తాను ప్రస్తుతం నివసిస్తున్న పెద్ద ఎస్టేటును కూడా అమ్మే ప్రయత్నాలు ప్రారంభించాడు.‘‘నేను చనిపోయాక నాకు సంబంధించిన సమస్త ఆస్తులూ వేలానికి వెళతాయి. ఆ డబ్బు పేదల సంక్షేమానికి వెళుతుంది’’ అంటున్న కెన్ హమ్ ‘‘నాలాగే సంపన్నులు ఎందుకు చేయరు?’’ అని ప్రశ్నిస్తున్నాడు. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన కెన్ హమ్కు పేదరికంలోని బాధలు ఏమిటో తెలుసు.
కెన్ ఎనిమిది నెలల వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు.తల్లే కుటుంబ భారాన్ని తలకెత్తుకుంది. అష్టకష్టాలు పడింది. చికాగోలోని చైనాటౌన్‌లో ఉన్న ఒక ఫ్యాక్టరీలో ఆమె పనిచేసేది.‘బిల్‌గేట్స్,వారెన్ బఫెట్లను అభిమానించే హమ్ ‘‘ప్రతి మనిషీ ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా తమ పరిధిలో ఇతరులకు సహాయపడాలి’’ అంటున్నాడు.