kenya tour
-
సెంచరీ కోసం...
సెంచరీ కోసం హన్సిక చాలా కష్టపడుతున్నారు. హీరోయిన్గా ఇంకా హాఫ్ సెంచరీ కూడా కంప్లీట చేయలేదు. అప్పుడే వందకి టార్గెట్ పెట్టారేంటి అనుకుంటున్నారా? ఈ 100 సినిమాల లెక్కకు సంబంధించినది కాదు. పబ్లిక్కు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే పోలీసులకు ఫోన్ చేసేది 100 నంబర్‌కే కదా. ఆ నంబర్ గురించి చెబుతున్నాం. విషయం ఏంటంటే.. అధర్వ, హన్సిక జంటగా సామ్ ఆంటోన్ దర్శకత్వంలో ‘100’ పేరుతో ఓ తమిళ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు అధర్వ. అందుకే టైటిల్ ‘100’ అని పెట్టి ఉంటారని ఊహించవచ్చు. ఇందులో హన్సికది రెగ్యులర్ గ్లామరస్ క్యారెక్టర్ కాదట. పెర్ఫార్మెన్స్కి ఫుల్ స్కోప్ ఉంది. అందుకే ఇష్టంగా కష్టపడి చేస్తున్నారట. ‘‘ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్. సినిమా పూర్తయింది. ఈ సినిమా జర్నీ మంచి ఎక్స్పీరియన్స్. యాక్షన్ ప్యాక్డ్గా సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం హన్సిక కెన్యాలో ఉన్నారు. బ్యాలెన్స్ ఉన్న సాంగ్ షూట్ కోసమే అని కొందరు, హాలీడే అని మరికొందరు అంటున్నారు. -
విద్వేష ప్రసంగాలపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
విద్వేష ప్రసంగాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. జకీర్ నాయక్ ప్రసంగాల అంశం తీవ్ర వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం కెన్యా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి తన ప్రసంగంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్వేష ప్రసంగాలు, హింసాత్మక బోధనల వల్ల సమాజంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతోందని, ఇలాంటి తీవ్రవాద సిద్ధాంతాలను ఎదుర్కొనేందుకు యువత సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చేవారిని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని వాడుకునేవారిని కూడా ఖండించాలంటూ పరోక్షంగా పాకిస్థాన్‌ను ప్రస్తావించారు. యూనివర్సిటీ ఆఫ్ నైరోబిలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉగ్రవాదం, విద్వేషాలు లేని ప్రపంచం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు సురక్షితంగా, భద్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. ఉగ్రవాదం పీచమణిచే శక్తి యువతకే ఉంటుందని ఆయన అన్నారు. ఆర్థిక లక్ష్యాలను సాధించే దిశగా నిలకడగా పోరాడాలని, అదే సమయంలో దేశవాసుల భద్రతను కూడా మర్చిపోకూడదని తెలిపారు.