టీమిండియా మాజీ పేసర్‌కు బీజేపీ టికెట్
న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీమిండియా మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్‌కు బీజేపీ టికెట్ కేటాయించింది. ఉదుమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శ్రీశాంత్ బరిలో దిగనున్నాడు. శుక్రవారం 23 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను బీజేపీ ప్రకటించింది.
ఇటీవల శ్రీశాంత్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కేరళ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. దీంతో కేరళ ఎన్నికల్లో శ్రీశాంత్ ను బరిలో దింపాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. అతనికి తిరువనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కేటాయించినట్టు ఇటీవల వార్తలు వచ్చినా.. ఉదుమ నుంచి బీజేపీ బరిలో దింపింది. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి వచ్చే నెల 16న ఎన్నికలు జరగనున్నాయి.