శక్తిమంతమైన భారతీయుల్లో కేరళ వ్యాపారవేత్త
దుబాయ్: మరోసారి కేరళ వ్యాపార వేత్త యూసఫ్ ఆలీ ఎంఏ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గల్ఫ్ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన భారతీయునిగా లాలూ గ్రూప్ డైరెక్టర్ యూసఫ్ తిరిగి ఎంపికైయ్యాడు. ప్రతీ ఏడాది విడుదల చేసే ఈ జాబితాలో యూసఫ్ తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. దీంతో గల్ఫ్ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన భారతీయునిగా ఐదోసారి ఎంపికైయ్యాడు.
ఈ మధ్యనే అబు దుబాయ్ చాంబర్ కు డైరెక్టర్ గా ఎన్నికైన యూసఫ్.. ఏకకాలంలో రెండు ఘనతలు సాధించిన తొలి భారతీయునిగా నిలిచాడు. ఇదిలా ఉండగా 2014 ఫోర్భ్స్ జాబితాలో కూడా యూసఫ్ స్థానం సంపాదించడం విశేషం.