Kerala women
-
APCO: కేరళ కుట్టిలకు ఆంధ్రా వస్త్రాలు
సాక్షి, అమరావతి: మలయాళీ సీమలో ఆంధ్రా చేనేత వస్త్రాల విక్రయానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఆప్కోతో కేరళ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హ్యాండ్ వీవ్) ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ చైర్మన్ గోవిందన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణాచలం సుకుమార్, మార్కెటింగ్ మేనేజర్ సందీప్ రెండు రోజుల క్రితం ఏపీలో పర్యటించి చేనేత వస్త్రాల తయారీ, ఆప్కో ద్వారా విక్రయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు, వీసీ అండ్ ఎండీ చదలవాడ నాగరాణితో చర్చించారు. ఏపీలో చేనేత వస్త్రాలు, వాటి డిజైన్లు, నాణ్యత బాగున్నాయని, వాటిని కేరళలోని స్టాల్స్‌లో విక్రయిస్తామని వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా కేరళ ప్రభుత్వం చేనేత సొసైటీల కోసం నిర్వహిస్తున్న 30 అధికారిక స్టాల్స్‌లో ఏపీ చేనేత వస్త్రాలను విక్రయించనున్నారు. ఏపీలో చేనేతకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెడుతున్న పొందూరు, ఉప్పాడ, పెడన, మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి తదితర ప్రాంతాలకు చెందిన వస్త్రాలను కేరళలోని స్టాల్స్‌లో విక్రయాలకు ఉంచనున్నారు. ప్రధానంగా కేరళలో ఘనంగా నిర్వహించే ఓనం, క్రిస్మస్, రంజాన్ మాసాల్లో ఏపీ చేనేత వస్త్రాలను అత్యధికంగా విక్రయించేలా ఆప్కో కార్యాచరణ చేపట్టింది. కలంకారీ వస్త్రాలను కొనుగోలు చేసిన హెన్‌టెక్స్ కాగా, కేరళ రాష్ట్రానికి చెందిన హెన్‌టెక్స్ (కేరళ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) ఇప్పటికే ఏపీ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి తీసుకెళ్లింది. నాలుగు రోజుల క్రితం పెడనలో పర్యటించిన హెన్‌టెక్స్ బృందం కలంకారీ వస్త్రాలపై అమితాసక్తి చూపించింది. పెడన కలంకారీ డిజైన్లతో కూడిన రూ.29.50 లక్షల విలువైన వస్త్రాలను కొనుగోలు చేయడం గమనార్హం. చేనేతకు ఊతమివ్వడమే లక్ష్యం రాష్ట్రంలోని చేనేత పరిశ్రమకు ఊతమిచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగానే కేరళలోని ప్రభుత్వ అధికారిక స్టాల్స్‌లో ఏపీ చేనేత విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకున్నాం. ఏపీ చేనేత సొసైటీల ప్రతినిధులు కేరళలోని స్టాల్స్‌కు వస్త్రాలు సరఫరా చేసి, నెలలోపులోనే విక్రయాలకు సంబంధించిన మొత్తాలను తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసినందుకు ఆప్కోకు కేవలం 2 శాతం సర్వీస్ రుసుం వసూలు చేస్తాం. – చిల్లపల్లి వెంకట నాగమోహనరావు, ఆప్కో చైర్మన్ చదవండి: ఆలయాలకు 'ప్రకృతి' ఉత్పత్తులు -
ప్రేమించి పెళ్లాడి ఉగ్రవాదిగా మారిన భారత డెంటిస్ట్.. జైల్లోనే
కాబూల్: తాలిబన్ల వశమైన అఫ్గానిస్తాన్‌లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ దేశంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. సాధారణ ప్రజలే ఇలా ఉంటే జైళ్లల్లో ఉన్న ఖైదీలు భయాందోళన చెందుతున్నారు. ఆ జైళ్లల్లో మగ్గుతున్న వారిలో పలువురు భారతీయులు ఉన్నారు. వారిలో కేరళకు చెందిన నయని అలియాస్ ఫాతిమా కథ వింటే కన్నీళ్లు రాకుండా ఉండవు. ప్రేమించిన యువకుడిని పెద్దలను వివాహం చేసుకుని అఫ్గానిస్తాన్ వెళ్లింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకున్న ఆమె భర్తతో కలిసి ఉగ్రవాదిగా మారింది. భర్త చనిపోగా ఆమె జైలు జీవితం గడుపుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: మొదలైన తాలిబన్ల అరాచకం.. ఇంటింటికెళ్లి నగదు లూటీ కేరళకు చెందిన బిందు, సంపత్‌ల కుమార్తె నిమిష దంత వైద్యురాలు. ఆమె ఒకరిని ప్రేమించింది. పెద్దలు వారిస్తున్నా వినకుండా మతం మార్చుకుని వివాహం చేసుకుంది. నిమిష తన పేరు ఫాతిమాగా మార్చుకుంది. అయితే 2016లో భర్తతో కలిసి నిమిష అఫ్గనిస్తాన్‌కు వెళ్లింది. అక్కడ భర్తతో పాటు ఆమె కూడా ఉగ్రవాదిగా మారింది. ఈ క్రమంలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్లకు కాల్పుల్లో భర్త మరణించాడు. తన పాపతో కలిసి అక్కడే జీవిస్తున్న ఫాతిమాకు ప్రాణభయం ఏర్పడింది. తమను హతమారుస్తాయనే భయంతో 2019లో అఫ్గాన్ ప్రభుత్వానికి ఫాతిమా లొంగిపోయింది. అప్పటి నుంచి ఫాతిమా జైల్లో ఉంటోంది. అయితే ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఫాతిమా తల్లి బిందు ఆందోళనలో ఉన్నారు. బందీగా ఉన్న తన కుమార్తెను విడిపించుకురావాలని బిందు కేంద్ర ప్రభుత్వానికి 1,882 సార్లు విజ్ఞప్తి చేసింది. తన బిడ్డ ఉగ్రవాది కాదని, ఆమె రాకతో దేశానికి వచ్చిన ముప్పేం లేదని స్పష్టం చేసింది. కాబూల్ జైల్లో ఉంటున్న తన కుమార్తె విడుదలకు సహకరించాలని ఆమె కనిపించిన మంత్రి, ఎమ్మెల్యేలందరినీ కోరుతోంది. అయితే ఫాతిమాతో పాటు మరో 20 మంది యువతులు అఫ్గాన్ వెళ్లారని తెలిసింది. వారిలో ఫాతిమా మాదిరి ముగ్గురు మహిళలు మారారని, వారు జైళ్లో ఉంటున్నారని వారిని విడుదల చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: కాబూల్ ఎయిర్‌పోర్టులో కాల్పులు.. ఐదుగురు మృతి -
‘మగవాళ్ల పనులు నీకెందుకమ్మా సుభద్ర..'
ఆర్యా రాజేంద్రన్ (21) గురించి ఆ మధ్య దేశమంతా గొప్పగా చెప్పుకుంది. ఆర్య చిన్న వయసులో తిరువనంతపురం మేయర్‌గా ఎన్నికవడమే అందుకు కారణం. ఆర్య వయసు అమ్మాయే సుభద్ర. ఇరవై ఒక్కేళ్లు. అయితే తనేమీ రాజకీయాల్లో లేదు. తనింటి కోసం నాలుగు పనులు చేస్తోంది. ఆ ఘనతే ఆమెను ఊళ్లో వండర్ గర్ల్‌గా నిలబెట్టింది. సుభద్ర పాఠాలు చెబుతుంది. డిగ్రీ చదివింది కనుక అంతవరకు ఒకే. అయితే అదొకటే ఆమెకు ఉపాధి కాదు. పొలం పనులు చేస్తుంది. పుట్టగొడుగుల సాగు పనులు చూస్తుంది. రైతుల్నించి పాలు సేకరించి డైరీలకు రవాణా చేయిస్తుంది. పిండి మర నడుపుతుంది. ఒడ్ల నుంచి పొట్టు తీస్తుంది. ఇంకా కొన్ని బండ పనులు, భారమయ్యే పనులు మీద వేసుకుంది. అన్ని పనులూ కుటుంబ పోషణ కోసం. సాధారణంగా గ్రామాల్లో ఈ తరహా పనులన్నీ మగవాళ్లే చేస్తారు. ఒడిశా, జైపూర్ జిల్లాలోని మారుమూల గ్రామం ‘బందా’ సుభద్ర వాళ్లది. ఇంట్లో ఆమెతో కలిపి ముగ్గురే ఉంటారు. తండ్రి, అన్న, తను. తల్లి లేదు. అన్నకు ఉద్యోగం లేదు. తండ్రి అప్పులు చేయడంతో అవి తీర్చందే ఆయన ఊరు దాటి వెళ్లి పరిస్థితి లేదు. ఆయనకు రెండెకరాల పొలం ఉంది. అందులో వరి, కూరగాయలు పండించేవాడు. పాడి రైతుల నుంచి పాలను చుట్టుపక్కల డెయిరీలకు సరఫరా చేసేవాడు. వరి పొట్టు తీసేవాడు. అలా కొంత డబ్బు వచ్చేది. అన్న ఇంజినీరింగ్ చేసే సమయంలో తండ్రికి ఆ పనుల్లో సహాయం చేసేది సుభద్ర. ‘మగవాళ్ల పనులు నీకెందుకమ్మా..’ అంటున్నా వినిపించుకునే కాదు. ఎవరో ఒకరు సహాయం చేయకపోతే నాన్న కూలబడిపోతాడు. కూలబడే వరకు ఎందుకు చేయడం? ఎందుకంటే.. అప్పు తీరాలి. ఐదేళ్ల క్రితం కొడుకు చదువు కోసం యాభై వేల రూపాయలు అప్పు చేశాడాయన. ఆ అప్పు సంగతీ, అదింకా తీరని సంగతీ సుభద్రకు తెలుసు. పిల్లలిద్దరికి డిగ్రీలు చేతికి వచ్చేసరికి అజయ్‌కి (సుభద్ర తండ్రి) అప్పు తీర్చాల్సిన నోటీసులు చేతికొచ్చాయి. వాస్తవాన్ని గ్రహించింది సుభద్ర. అన్నయ్యని ఉద్యోగం వెతుక్కోమని చెప్పి తను ఊళ్లో పనుల్లో పడిపోయింది. అప్పు తీర్చడం, నాన్నకు సహాయంగా ఇంటిని నడిపించడం ఇప్పుడు ఆమె బాధ్యతలు. గత ఏడాదే సుభద్ర తమ గ్రామానికి దగ్గర్లోని ఛటియాలోని ఎం.హెచ్.డి. మహావిద్యాలయ కాలేజ్ నుంచి ఆర్ట్స్‌లో పట్టభద్రురాలైంది. పేరుకు రెండు ఎకరాలున్నా, పంట దిగుబడులు లేవు. వడ్ల పొట్టు తీసే మిషన్ సొంతదే అయినా కరెంట్ బిల్లు కట్టలేకపోవడంతో కనెక్షన్ తీసేశారు. వేరే రాబడులూ తగ్గిపోయాయి. ఆ స్థితిలో తండ్రికి సహాయంగా కాక, ఇంటికి సహాయంగా దొరికిన పనులన్నీ మీద వేసుకుంది సుభద్ర. ఊళ్లో వాళ్లు కూడా.. ‘ఆడపిల్ల ఇంత అలసిపోవడం ఏంటమ్మా..’ అని వారించారు. ఆమె వినలేదు. వినే పరిస్థితీ లేదు. తను ఇంటర్ చదివేటప్పటి నుంచే పిల్లలు పాఠాలు చెబుతుండేది. ఆ అనుభవంతో ట్యూషన్లు మొదలుపెట్టింది. ట్యూషన్లకు, తక్కిన పనులకు ఆమె చేసుకున్న సమయ విభజన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ‘అద్భుతమైన అమ్మాయి’ అనే మాట తప్ప ఆమెకు ఇంకే ప్రశంసా సరిపోదని అనిపిస్తుంది. సుభద్ర రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తుంది. పొలానికి వెళుతుంది. తొమ్మిది వరకు పొలం పనులు. ఇంటికొచ్చాక దైనందిన చర్యలు ముగించుకుని రైతుల్నించి పాలు సేకరించడానికి వెళుతుంది. వాడుకకు కుదుర్చుకున్న వాహనాలలో ఆ పాలను డైరీలకు చేరుస్తుంది. తర్వాత వడ్ల పొట్టు తీసే పని, పిండి మర నడిపే పని. ఇవన్నీ ఉదయం 11 సాయంత్రం 6 ఆరు గంటల మధ్య జరిగిపోతాయి. మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలోనే తమ పొలంలోని పుట్టగొడుగుల పంట బాగోగులు పరిశీలిస్తుంది. ఆరు తర్వాత ట్యూషన్‌కు వచ్చే 40 మంది పిల్లలతో మళ్లీ బిజీ. ఆమె ఎప్పుడూ లెక్కలు వేసుకోలేదు కానీ, నెలంతా ఇలా కష్టపడితే వచ్చేది దాదాపు 30 వేల రూపాయలు. డబ్బు కన్నా కూడా ఆమెకు ఒకటి అనుభవం అయింది. ‘‘కష్టకాలాన్ని అనుకూలంగా మార్చుకోవడమే జీవితం. జీవితమే ఉపాధి చూపిస్తుంది. ఈ వాస్తవాన్ని ప్రతి ఆడపిల్లా తెలుసుకోవాలి. మగ పని అని చతికిల పడకుండా.. మనిషి పని అనుకుని గడప దాటాలి’’ అంటుంది సుభద్ర. తనొక పెద్ద పారిశ్రామిక వేత్త అయి, ఊరికి దగ్గరల్లో మంచి వృద్ధాశ్రమం నెలకొల్పాలని ఆమె ధ్యేయం. -
వైరలవుతున్న కేరళ బామ్మ ఆవేదన
తిరువనంతపురం : సోషల్ మీడియా విసృతిలో చెడుకు ఎంత అవకాశం ఉంటుందో మంచికి అంతే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా కొంతమంది జీవితాలు మెరుగుపడ్డాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారి ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేయగానే మంచి మనసున్న నెటిజన్లు కొందరు వారికి సాయం చేయడానికి ముందుకు వచ్చేవారు. ఎవరి నుంచి ఆశించకుండా కష్టపడి బతికేవారికి దేవుడే ఏదో ఒక ఉపాధి చూపిస్తాడనడానికి ఈ వార్త ఉదాహరణ. ఇక అసలు విషయంలోకి వెళితే.. కేరళకు చెందిన పార్వతీ అమ్మ అనే 70 ఏళ్ల బామ్మ ఎవరిపై ఆధారపడకుండా మన్నార్కాడ్ సమీపంలోని కరింబా వద్ద ధాబాను నడిపేవారు. ఆమె చేతి వంటను ధాబాకు వచ్చే కస్టమర్లు మెచ్చకోకుండా ఉండేవారు కాదు. ధాబాపై వచ్చే లాభాలతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చేది. కానీ కరోనా వచ్చి ఆమె జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ధాబాలు తెరిచినా కస్టమర్లు రావడానికి భయపడుతుండడంతో ఆమె ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. (చదవండి : సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో) దీంతో పార్వతీ అమ్మ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను పంచకున్నారు. 'మీ అందరికి ఒక విజ్ఞప్తి. ఎంతో కష్టపడి డాబాను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఏనాడు ఎవరి దగ్గర చేయి చాపలేదు. కానీ పాడు కరోనా మా జీవితాలను కుదిపేసింది. మీరందరిని నేను కోరేది ఒకటే.. కస్టమర్లు నా ధాబాకు వచ్చేలా ఈ వీడియోనూ ప్రమోట్ చేయండి.. నా కుటుంబాన్ని ఆదుకోండి.. అందుకు ప్రతిఫలంగా నా చేతి వంటను మీకు రుచి చూపిస్తానంటూ ' పార్వతీ చెప్పుకొచ్చారు. అయితే పార్వతీ అమ్మను కలిసిన ఆరిఫ్ షా అనే జర్నలిస్ట్ ఆమె మాటలను వీడియో తీసి ట్విటర్లో షేర్ చేశాడు. ఇది కేరళ స్టోరీ.. మరో బాబా కా ధాబా స్టోరీ.. ఆమెను ఆదుకుందాం నాతో చేతులు కలపండి అంటూ క్యాప్షన్ జత చేశారు. ఆరిఫ్ షా షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాబా కా ధాబాకు అందిన సాయం లాగే కేరళ బామ్మకు సాయం చేద్దామంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. దక్షిణాది హీరోయిన్ రిచా చద్దా కూడా కేరళ బామ్మను ఆదుకోవాలంటూ ఆమె వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. కాగా మొన్నటికి మొన్న ఇదే తరహాలో ఢిల్లీలోని మాలవీయనగర్‌లో ఉన్న బాబాకా ధాబా గురించి ట్విటర్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కరోనా, లాక్డౌన్ కారణంగా డిమాండ్ లేక షాపు యజమాని కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలో షేర్ చేశారు. దాదాపు 80 ఏళ్ళ వృద్ధాప్యంలో జీవనం కోసం ఆ జంట పడుతున్న ఆరాటాన్ని చూపించారు. అంతేకాదు వీరిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరలయ్యి.. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు బాబా కా ధాబాకు పోటెత్తుతున్నారు. Kerala Story : This old lady runs a Dhaba in order to feed her family. She doesn't have customers & struggles to earn. It’s resilient and delicious Parvathyamma’s eatery at Karimba, near Mannarkkad. After Baba ka Dhaba, Keralites turn to help this elderly woman. #BabaKaDhaba pic.twitter.com/DL3n4VddA8 — Aarif Shah (@aarifshaah) October 10, 2020 -
రికార్డ్ కోసం సాంప్రదాయ నృత్య ప్రదర్శన
దుబాయ్ లో నివసిస్తున్న మలయాళీలు అక్కడ అరుదైన రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసుల స్త్రీలు భారీ నృత్య ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న జరగనున్న ఓ కార్యక్రమంలో దాదాపు 1300 మంది మహిళలు ఒకేసారి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం 40 గ్రూపులుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. స్కూల్ విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ఈ ప్రదర్శన కోసం సిద్ధమవుతున్నారు. ప్రముఖ మలయాళ నటి ఆశా శరత్ నృత్య దర్శకత్వంలో కేరళ సాంప్రదాయ నృత్యం కైకొట్టైకలిని 15 నిమిషాల 30 సెకన్ల సుధీర్ఘ ప్రదర్శన ఇవ్వనున్నారు. కేరళలో నిర్వహించే త్రిసూర్ పోరం తరహాలో దుబాయ్ లో నిర్వహిస్తున్న పోరమ్ దుబాయ్ లో భాగంగా ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దుబాయ్, అబుదాబి, అజ్మాన్, అల్ ఐన్ ప్రాంతాల్లో నివసిస్తున్న మలయాళీలు పాల్గొననున్నారు. తిరువథిరకలి అని కూడా పిలుచుకునే ఈ సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో భారత్ వెలుపల అది ఎక్కువ మంది ప్రదర్శించిన రికార్డ్ ను సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
రికార్డ్ కోసం సాంప్రదాయ నృత్య ప్రదర్శన
-
అమెజాన్ లో మహిళా ఫోర్స్
కేరళ: కేరళ మహిళలు దేశంలోని మహిళల్లో ముందున్నారు. వారు మగవారితో సమానంగా ముందుకు దూసుకెళుతున్నారు. వారితో ఆన్లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ ఓ ప్రయోగం చేయాలనుకొంది. ఏడుగురు మహిళతో దేశంలోనే మొట్టమొదటి సారిగా అసైన్మెంట్ డెలివరి స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకోవడం, సకాలంలో వాటిని టూవీలర్‌పై తీసుకెళ్లి డెలివరి చేయడం వారి విధి. ఇంతవరకు మగవారికే పరిమితమైన ఈ డ్యూటీ మూటను వారు భుజానకెత్తుకున్నారు. తాము కూడా మగవారికి ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు. వారి పని విధానాన్ని చూసిన యాజమాన్యం కూడా వారిని ఎంతో ప్రశంసిస్తోంది. ఏడుగురు మహిళలతో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ప్రత్యేక డెలివరి స్టేషన్ అద్భుతంగా పనిచేస్తోందని యాజమాన్యం చెబుతోంది. వివిధ వస్తువులతో కూడిన బరువైన బ్యాగ్‌ను మోసుకొని టూ వీలర్‌పై డెలివరికి వెళ్లడం అంత సులభమైన డ్యూటీ ఏమీ కాదని, ఈ విషయంలో తాము తీసుకున్న ఏడుగురు మహిళలు రాణించడం చూసిన మహిళలు తమను కూడా ఇలాంటి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తులు అనేకం వస్తున్నాయని యాజవాన్యం తెలిపింది. తాము వ్యాపార విస్తరణనుబట్టి వీలైనంత మంది మహిళలను తీసుకునేందుకు ప్రయత్నిస్తామని, అంతర్జాతీయ అమెజాన్ స్టేషన్ మేనేజర్ దివ్యా తెలిపారు. ఇంతకాలం మగవాళ్లు చేస్తున్న ఈ డెలివరి జాబ్‌ను చేయడం ఎలా అంటూ తొలుత కొంత సందేహించిన మాట వాస్తవమేనని, అయితే డ్యూటీ వేళలు అనుకూలంగా ఉండడంతో ఉద్యోగానికి సిద్ధ పడ్డామని 37 ఏళ్ల దీప్తి ప్రమోద్ తెలిపారు. రోజుకు మూడు, నాలుగు కిలీమీటర్ల పరిధిలో 40 సార్లు వస్తువులను డెలివరి చేస్తామని ఎం. సంధ్యా అనే 34 ఏళ్ల యువతి చెప్పారు.