దుబాయ్ లో నివసిస్తున్న మలయాళీలు అక్కడ అరుదైన రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసుల స్త్రీలు భారీ నృత్య ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న జరగనున్న ఓ కార్యక్రమంలో దాదాపు 1300 మంది మహిళలు ఒకేసారి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం 40 గ్రూపులుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. స్కూల్ విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ఈ ప్రదర్శన కోసం సిద్ధమవుతున్నారు.
ప్రముఖ మలయాళ నటి ఆశా శరత్ నృత్య దర్శకత్వంలో కేరళ సాంప్రదాయ నృత్యం కైకొట్టైకలిని 15 నిమిషాల 30 సెకన్ల సుధీర్ఘ ప్రదర్శన ఇవ్వనున్నారు. కేరళలో నిర్వహించే త్రిసూర్ పోరం తరహాలో దుబాయ్ లో నిర్వహిస్తున్న పోరమ్ దుబాయ్ లో భాగంగా ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దుబాయ్, అబుదాబి, అజ్మాన్, అల్ ఐన్ ప్రాంతాల్లో నివసిస్తున్న మలయాళీలు పాల్గొననున్నారు. తిరువథిరకలి అని కూడా పిలుచుకునే ఈ సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో భారత్ వెలుపల అది ఎక్కువ మంది ప్రదర్శించిన రికార్డ్ ను సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment