Asha Sarath
-
భాగమతి నటి ఫేక్ వీడియో.. కేసు నమోదు
సినిమాను రూపొందించటమే కాదు ఆ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయటంలోనూ సినీ వర్గాలు సరికొత్త దారులు వెతుకుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ప్రయత్నం బెడిసి కొడుతుంది. తాజాగా ఓ మలయాళ నటికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. భాగమతి సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన ఆశా శరత్ ఇటీవల తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆశా మేకప్ లేకుండా కనిపించిన ఆ వీడియోలో ‘తన భర్త కనిపించటం లేదని, ఆచూకి తెలిసిన వారు కేరళలోని కట్టప్పన్ పోలీస్ స్టేషన్లో తెలియజేయాల’ని కోరారు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు నిజమే అనుకున్నారు. విషయం సీరియస్ అవుతుందని గ్రహించిన ఆశా శరత్ నెమ్మదిగా అసలు విషయాన్ని బయటపెట్టారు. తాను ఆ వీడియోను కేవలం ‘ఎవిడే’ సినిమా ప్రమోషన్లో భాగంగానే రిలీజ్ చేశానని, నిజంగా తన భర్త కనిపించకుండా పోలేదని వెల్లడించారు. దీంతో ఆశా చేసిన పనిపై నెటిజన్లు మండి పడుతున్నారు. ఇలాంటి పోస్ట్‌లతో నిజమైన వీడియోలను కూడా ప్రజలు నమ్మడం మానేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళకు చెందిన లాయర్ శ్రీజిత్, ఫేక్ వీడియో సర్క్యూలేట్ చేసినందుకు ఆశా శరత్ పై చర్యలు తీసుకోవాలంటూ ఇడుక్కి పోలీస్ స్టేషన్లో కేసు వేశారు. -
రికార్డ్ కోసం సాంప్రదాయ నృత్య ప్రదర్శన
దుబాయ్ లో నివసిస్తున్న మలయాళీలు అక్కడ అరుదైన రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసుల స్త్రీలు భారీ నృత్య ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న జరగనున్న ఓ కార్యక్రమంలో దాదాపు 1300 మంది మహిళలు ఒకేసారి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం 40 గ్రూపులుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. స్కూల్ విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ఈ ప్రదర్శన కోసం సిద్ధమవుతున్నారు. ప్రముఖ మలయాళ నటి ఆశా శరత్ నృత్య దర్శకత్వంలో కేరళ సాంప్రదాయ నృత్యం కైకొట్టైకలిని 15 నిమిషాల 30 సెకన్ల సుధీర్ఘ ప్రదర్శన ఇవ్వనున్నారు. కేరళలో నిర్వహించే త్రిసూర్ పోరం తరహాలో దుబాయ్ లో నిర్వహిస్తున్న పోరమ్ దుబాయ్ లో భాగంగా ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దుబాయ్, అబుదాబి, అజ్మాన్, అల్ ఐన్ ప్రాంతాల్లో నివసిస్తున్న మలయాళీలు పాల్గొననున్నారు. తిరువథిరకలి అని కూడా పిలుచుకునే ఈ సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో భారత్ వెలుపల అది ఎక్కువ మంది ప్రదర్శించిన రికార్డ్ ను సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
రికార్డ్ కోసం సాంప్రదాయ నృత్య ప్రదర్శన
-
న్యాయ పోరాటం చేస్తా
న్యాయం కోసం పోరాటం చేస్తానంటున్నారు నటి ఆషా శరత్. కమలహాసన్ పాపనాశం చిత్రం చూసిన వారు ఈమె ఎవరో చెప్పనవసరం ఉండదనుకుంటా. తెలుగు వెర్షన్ దృశ్యంలో నటి నదియా పోషించిన పోలీసు అధికారి పాత్రను పాపనాశంలో ఆషాశరత్ పోషించి ప్రశంసలందుకున్నారు. పాపనాశం చిత్రంలో ఈమె నటనను చూసి ముగ్ధుడెన కమల్ తన తాజా చిత్రం తూంగావనం చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇది ఆశాశరత్ రీల్ విషయం అయితే ఇక రియల్ వ్యవహారానికొస్తే ఇటీవల ఆమె అశ్లీల దృశ్యాలు సోషల్నెట్ వర్క్సులోను, వాట్సాప్‌లోను హల్చల్ చేశాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆషాశరత్ చాలా తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో న్యాయపోరాటం చేస్తానంటున్నారు. అంతేకాదు న్యాయం జరిగే వరకు వదిలేది లేదని అంటున్నారు. దీని గురించి ఆమె తన ఫేస్బుక్లో పేర్కొంటూ కష్టకాలంలో తనకు ఆదరించి అక్కున చేర్చుకున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. అయితే కొన్ని దుష్టశక్తులు సోషల్ నెట్‌వర్క్సులో నీతిమాలిన చర్యలకు పాల్పడుతూ అసభ్యకర దృశ్యాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటివి తనకు చాలా దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు. ఇలా ఒక మహిళ ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టే దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అందుకే ఈ వ్యవహారంపై కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. తన ఫిర్యాదుపై వెంటనే చర్యలకు దిగిన పోలీసుల అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ప్రస్తుతం ఈ కేసును సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని త్వరలోనే నేరస్థులను పట్టి అరెస్టు చేస్తారనే నమ్మకం తనకుందని అన్నారు. మహిళలకు వ్యతిరేకంగా జరిగే ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి శిక్ష పడాలి. న్యాయం జరిగే వరకు పోరాడుతాను అని పేర్కొన్నారు. -
హిందీ ‘దృశ్యం’లో..!
మోహన్‌లాల్, మీనా జంటగా రూపొందిన మలయాళ సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’లో పోలీసాఫీసర్ పాత్రను ఆశా శరత్ చేశారు. ఇదే పాత్రను తెలుగు ‘దృశ్యం’లో నదియా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళ రీమేక్‌లో పోలీసాఫీసర్ పాత్రను ఆశా శరత్ చేస్తున్నారు. ఇప్పుడు హిందీలోనూ ‘దృశ్యం’ తెరకెక్కనుంది. ఈ రీమేక్‌లో పోలీసాఫీసర్ పాత్రను టబు చేయనున్నారని సమాచారం. హీరోగా అజయ్ దేవగన్ నటించనున్నారు.