కాల్యాణ వైభోగమే
ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు టి. సుబ్బరామిరెడ్డి మనవడు కేశవ్ (పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి తనయుడు జీవీ సంజయ్‌రెడ్డి, టీయస్సార్ తనయ పింకీరెడ్డిల కుమారుడు), తేరా చిన్నపరెడ్డి, కల్పన దంపతుల కుమార్తె వీణల వివాహం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.
అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి ప్రముఖ హీరోలు అమితాబ్‌బచ్చన్, రజనీకాంత్, మోహన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, మహేశ్‌బాబు భార్య నమ్రత తదితరులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు.