ఔను..! వారి ఆత్మలు క్షోభిస్తున్నాయి
సాక్షి, తిరుపతి: ఔను.. అడవికి ప్రాణాలు బలిదానం ఇచ్చిన ఉద్యోగుల ఆత్మలు ఇంకా క్షోభిస్తున్నాయి. కాలం తెచ్చిన మార్పులతో పెరిగిన నేరప్రవృత్తిని నిరోధించడానికి ప్రభుత్వాలు స్పందించకపోవడం, కనీసం అధికారులు కూడా ఆలోచించని తీరుతో అటవీ ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. బ్రిటీష్ పాలకుల హయాంలో కూడా అడవి దొంగలు ఉద్యోగుల ప్రాణాలు బలిగొన్నారు. అటవీశాఖకు రాయలసీమ చరిత్రలో అదో దుర్ధినం. వారికి నివాళులు అర్పించడం అటుంచి కనీసం ఆ తరువాత కూడా పాల కులు కళ్లు తెరిచినట్టు కనిపించడం లేదు. అం దుకు సాక్షీభూతమే తిరుపతి అడవుల్లో జరిగి న ఘోర కలిగా చెప్పవచ్చు.
అది 1939 సంవత్సరం మార్చి 17వ తేదీ. కడప జిల్లా చిట్వేలి మండలం హరిజనవాడ (మాలపల్లె)కు చెందిన శిగికేశవులు ఫారెస్టు గార్డు, కోడూరు పెంచలయ్య సహాయకుడు (వీరిద్దరూ బావాబామర్దులు), చిట్వేలి వడ్డిపల్లెకు చెందిన సోమయ్య ఫారెస్టు వాచర్. ఇప్పుడు ఎర్రచందనంగా పిలుస్తున్న చెట్లను అప్పట్లో బొమ్మకొయ్యగా పిలిచేవారు.
చిట్వేలి అటవీ రే ంజ్ పరిధిలోని తిమ్మాయగారిపల్లె బీట్ పరిధిలో అడవిని కొల్లగొడుతున్నట్టు సమాచారం అందింది. అడవి దొం గలను కట్టడి చేసేందుకు ముగ్గురూ బయలుదేరారు.
అడవిలోకి వెళ్లిన వారిని అడవి దొంగలు బంధించి సమీప గ్రామానికి తీసుకువచ్చారు. విచక్షణా రహితంగా నరికి అడవిలో పడేశారు. మృతదేహాలను పశువుల కాపరులు గమనించి కేశవులు భార్య అచ్చమ్మ, కుమారుడు ఎస్వీ.సుబ్బరాయన్, పెంచలయ్య భార్య నర్సమ్మ (పొట్టెమ్మ)కు తెలిపారు. వారి ఆర్తనాదాలు ఇంకా ఆ అడవిలోని స్మారక స్థూపం వద్ద ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అందుకు ఆనవాళ్లు కోల్పోతున్న స్థూపం నాటి చరిత్రను చెబుతోంది. ఆనాటి ఘటనను వివరించే వారే కాదు. ప్రాణాలు కోల్పోయిన వారి వారసులూ ఇంకా ఉన్నారు.
ఆ నాటి నుంచి కూడా అటవీశాఖ యంత్రాంగం పాఠాలు నేర్చుకోలేదు. ఎందుకంటే అడవి రక్షణకు నియమిస్తున్న సిబ్బందికే ఎలాంటి రక్షణ లేదు. రేంజర్, లేదా ఫారెస్టర్ వద్ద రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి 404 మస్కట్స్, ఆ తరువాత 303 రైఫిల్స్ రేంజ్ పరిధిలో ఒకటి లేదా రెండు మాత్రమే ఉండేవి. మిగతా వారికి శరీరంపై ఖాకీ దుస్తులు, కాళ్లకు బూట్లు, చేతిలో కర్ర మినహా ఎలాంటి ఆయుధాలు ఇచ్చేవారు కాదు. వీటితో అడవిని రక్షించడం సాధ్యమా?
ప్రపంచ మార్కెట్‌ను శాసించే అత్యంత విలువైన ఎర్రచందనం వనాలకు శేషాచలం అటవీ ప్రాంతం నెలవు. నాలుగు దశాబ్దాల క్రితం బొమ్మకొయ్య (నేటి ఎర్రచందనం) వేళ్లమీద లెక్కించే స్థాయిలో అక్రమ రవాణా జరిగేది. ప్రస్తుతం ఆ దుంగలకు ఉన్న విలువ టన్ను రూ. లక్షల్లో ఉంది. విస్తారంగా పెరిగి ఉన్న వృక్షాలను కొల్లగొట్టడానికి వన సేద్యానికి వెళ్లినట్లు అడవి దొంగలు వందల సంఖ్యలో అడవుల్లోకి తెగబడుతున్నారు. నిరాయుధులైన అటవీ సిబ్బంది అడవులను కాదు. కనీసం వారిని వారు రక్షించుకోలేని స్థితిలో ఉండక ఏమి చేయగలరు?