వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కాంగ్రెస్ వర్గీయుల దాడి
ఖమ్మం: ఏనుకూరు మండలం కేసుపల్లిలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారు. గాయపడినవారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. వైఎస్ఆర్ సిపి జిల్లా నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేంద్రకమిటీ సభ్యుడు మదన్‌లాల్, గుమ్మ రోశయ్య క్షతగాత్రులను పరామర్శించారు.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వారు ఓడిపోయారు. దానిని దృష్టిలో పెట్టుకొని, భూవివాదంను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ వర్గీయులు ఈ దాడికి పాల్పడినట్లు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తెలిపారు.