భారత్‌లో 10 కోట్లు దాటిన ఫేస్బుక్ యూజర్లు
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న భారతీయుల సంఖ్య 10 కోట్లను దాటింది. అమెరికా వెలుపల నెలవారీగా ఎక్కువ మంది ఫేస్బుక్ యూజర్లు క్రియాశీలంగా ఉంటున్న దేశంగా భారత్ నిలిచిందని మంగళవారం ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి.