కిలో టమాటా ఒక్క రూపాయికే!
కూడేరు (అనంతపురం) : టమాటా ధర కనిష్ట స్థాయికి పడిపోవటంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. మార్కెట్కు తీసుకువచ్చిన టమాటా పంటను ధర గిట్టుబాటు కాకపోవటంతో తిరిగి తీసుకెళ్లలేక రోడ్డు పక్కనే పారబోసి వెళ్లిపోతున్నారు. ఇది అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రంలోని పరిస్థితి.
మండలంలో దాదాపు 300 ల ఎకరాల్లో టమాటా పంట పండిస్తున్నారు. అయితే గత రెండు మూడు రోజులుగా టమాటా ధర మార్కెట్లో బాగా పడిపోయింది. శనివారం కిలో రూ.1కి తగ్గిపోవటంతో రైతులు రోడ్డు పక్కన పారబోశారు. కొందరు రైతులు పంటను కోయకుండా చేలల్లోనే వదిలేశారు.