4 తులాల బంగారు ఆభరణాలు, నగదు చోరీ
అనంతసాగరం: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఖాదర్ మస్తాన్ అనే వ్యక్తిలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు నాలుగు తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదును అపహరించుకుపోయారు.
పక్కనే ఉన్న ఖాదర్‌వలీ ఇంటి ఆవరణలోకి వెళ్లి కిటికీ ద్వారా లోపల చిల్లకు తగిలించిన షర్ట్‌ను బయటకు తీసి నగదు, సెల్‌ఫోన్‌ను తస్కరించుకుపోయారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు.