khajana
-
3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి
భూమి తన గర్భంలో అనేక రహస్యాలను దాచుకుంది. వాటి గురించి నేటికీ ఎవరికీ పూర్తిగా తెలియదు. అయితే ఈ రహస్యాలు కాలక్రమేణా ప్రపంచం ముందు బయటపడుతూనే ఉన్నాయి. టుటన్‌ఖామెన్ సమాధి 3000 సంవత్సరాలకు పైగా ప్రపంచానికి తెలియని పెద్ద రహస్యంగా నిలిచింది. 1922 నవంబర్‌లో బ్రిటిష్ ఈజిప్టు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్, అతని బృందం ఈజిప్టు రాజుల ఘాటీలో టుటన్‌ఖామెన్ సమాధిని తవ్వడం ప్రారంభించినప్పుడు అనేక రహస్యాలు ప్రపంచానికి తెలియవచ్చాయి. ఎడారి గర్భంలో దాగిన సమాధి టుటన్‌ఖామెన్ సమాధి 3000 సంవత్సరాలకు పైగా ఎడారి గర్భంలోనే దాగి ఉంది. 1922, నవంబర్ 4న కార్టర్ బృందం ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు వారు ఇసుకలో ఖననం చేసిన సమాధి మెట్లను కనుగొన్నారు. తరువాత ఆ బృందం మెట్ల దారిని శోధించింది. నవంబర్ చివరి నాటికి వారు ఒక గది, ఒక భారీ ఖజానా, సమాధి తలుపులను కనుగొన్నారు. కార్టర్, అతని బృందం అక్కడి తలుపునకు గల రంధ్రం నుంచి లోపలకి చూసి తెగ ఆశ్చర్యపోయారు. ఈవిధంగా వారు బంగారు నిధులతో నిండిన గదిని కనుగొన్నారు. 9 ఏళ్ల వయసులోనే పాలకుడు 1922, నవంబర్ 26న ఈ బంగారు నిధిని కార్టర్, అతని బృందం కనుగొంది. అయితే టుటన్‌ఖామెన్ మమ్మీ ఉన్న శవపేటికను చాలా కాలం తర్వాత కనుగొన్నారు. టుటన్‌ఖామెన్ ఈజిప్ట్ పాలకుడు. ఇతనిని కింగ్ టుట్ అని పిలిచేవారు. ఈజిప్ట్ ఫారో రాజు టుట్ 1333 బీసీలో కేవలం తన 9 సంవత్సరాల వయస్సులోనే ఈజిప్ట్ పాలకుడయ్యాడు. అతని పాలన అనంతరం అతను మరణించినప్పుడు, సంప్రదాయం ప్రకారం అతని మృతదేహాన్ని మమ్మీగా తీర్చిదిద్ది భద్రపరిచారు. అతని మమ్మీతో పాటు పలు కళాకృతులు, నగలు, నిధులు కూడా అతని సమాధిలో ఖననం చేశారు. అయితే కాలక్రమేణా ఈ సమాధి ఎడారి ఇసుకలో కూరుకుపోయింది. ఎట్టకేలకు వీడిన మరణ రహస్యం కింగ్ టుట్ సమాధిలో వేలాది కళాఖండాలు, ప్రసిద్ధ శిరస్త్రాణం లభ్యమయ్యాయి. సమాధి నుండి బయటపడిన అమూల్య వస్తువుల జాబితాను రూపొందించేందుకు కార్టర్, అతని బృందానికి సుమారు 10 సంవత్సరాలు పట్టింది. సమాధిని కనుగొన్న తరువాత కింగ్ టుట్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఈజిప్షియన్ చక్రవర్తులలో ఒకరిగా గుర్తింపుపొందారు. శాస్త్రవేత్తలు, విద్యార్థుల పరిశోధన అంశంగా ఇతని చరిత్ర నిలిచింది. అయితే కింగ్ టుట్ ఎలా మరణించాడనేది చాలా కాలం మిస్టరీగానే మిగిలింది. ఈ రాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని కొందరు చరిత్రకారులు అంటుండగా, మరికొందరు ప్రమాదంలో మరణించాడంటారు. అయితే ఒక శతాబ్దం తర్వాత శాస్త్రవేత్తలు డిజిటల్ ఇమేజింగ్, డీఎన్ఏ పరీక్షల ద్వారా కింగ్ టుట్ మలేరియాతో మరణించినట్లు కనుగొన్నారు. ఇది కూడా చదవండి: సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? దీనిని ఎందుకు ధరిస్తారు? -
తోషఖానా : సుష్మా స్వరాజ్‌దే భారీ గిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ పర్యటనల సందర్భంగా దేశ ప్రధానమంత్రి విదేశాంగమంత్రులు, ఇతర అధికార ప్రతినిధులకు అందించే బహుమతులు, గౌరవసూచికగా ఇచ్చే కానుకల రూపంలో కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో 17.7 కోట్ల రూపాయలు ప్రభుత్వనిధి తోషఖానాకు చేరాయి. వీటిలో దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు లభించిన కోట్ల రూపాయల బంగారు, వజ్రాల ఆభరణాల బహుమతి అతివిలువైనదిగా నిలిచింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన ఈ ఆరు సంవత్సరాల కాలంలో 230మందికి పైగా వ్యక్తులు 2,800 బహుమతులు అందుకోగా, వీటి విలువ సుమారు 17.74 కోట్ల రూపాయలు. సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు 2019లో ఆమెకిచ్చిన 6.7 కోట్ల విలువైన వెండి వజ్రాల పచ్చ ఆభరణాల సెట్ ఈ కాలానికి అత్యంత ఖరీదైన బహుమతిగా నిలిచింది. అలాగే 2015లో ప్రధాని మోదీ అందుకున్న 35 లక్షల విలువైన, హారము, చెవిపోగులు పెట్టె చాలా ఖరీదైన వాటిల్లో ఒకటిగా నిలిచింది. సాధారణంగా దేశ ప్రధానమంత్రి లేదా విదేశాంగ మంత్రికి ఖరీదైన బహుమతులు లభిస్తాయి. కానీ 2018-2019 కాలంలో కోట్ల విలువైన వజ్రాల గడియారాలతో చాలామంది అధికారులు టాప్ లో నిలిచారు. మంత్రులు, బ్యూరోక్రాట్ల తమ తమ విదేశీ పర్యటన సందర్భంగా మెమెంటోలు, సాంస్కృతిక కళాఖండాలు, పెయింటింగ్‌లు, ఫోటోలు, గాడ్జెట్లు, చీరలు, కుర్తాలతోపాటు మద్యం కూడా బహుమతిగా అందుకున్నారు. ముఖ్యంగా పాలరాయి రాయిపై మోదీ బొమ్మ, హిందీలో పద్యం వంటి వ్యక్తిగతీకరించిన బహుమతి కూడా ఉంది. అంతేకాదు 2014 నుండి తోషాఖానాకు చేరిన వాటిలో రహస్య ఇంటెలిజెన్స్ ఫైల్స్, పశ్చిమ బెంగాల్ నజాఫీ రాజవంశానికి చెందిన 18 వ శతాబ్దపు కత్తి, మహాత్మా గాంధీ డైరీ నుండి ఒక ఫ్రేమ్డ్ పేజీ, గాంధీ చిత్రాలు, అంతర్జాతీయ క్రికెట్ జట్టు ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్,బంతి, ఇత్తడి కంటైనర్‌లో నింపిన మానస సరోవర్ పవిత్ర జలం, బుల్లెట్ ట్రైన్ నమూనా, వెండి ఎద్దుల బండి ఉండటం విశేషం. సాంప్రదాయం ప్రకారం విదేశీ సందర్శనల సమయంలో దేశానికి చెందిన ముఖ్య ప్రతినిధులు అందుకున్న బహుమతులు నేరుగా ప్రభుత్వనిధి తోషాఖానాకు వెళతాయి. ఖరీదైన ఆభరణాలు, గడియారాల, కళాఖండాలు, గాడ్జెట్లు ఇతర వస్తువులు ఈ కోవలో ఉంటాయి. తోషాఖానా వెల్లడించిన డేటా ప్రకారం జూన్ 2014 - ఫిబ్రవరి 2020 మధ్య లభించిన బహుమతులలో 61శాతం 5,000 కంటే తక్కువ విలువైనవి కాగా, ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ విలువైనవి 4శాతం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ 650కి పైగా గిఫ్ట్ లు అందుకోగా, ఆ తరువాత వరుసలో సుష్మ స్వరాజ్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. అయితే వీటికి సంబంధించిన వివరాలకు సమాచార హక్కు నుంచి మినహాయింపు నివ్వడంతో అందుబాటులో లేవు. -
ప్రజలపై భారం మోపం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల భరోసా హైదరాబాద్: ప్రజలపై భారం మోపకుండా ఖజానాకు ఆదాయం పెంచుకునే వేరే మార్గాలను తమ ప్రభుత్వం అన్వేషిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవటం, వాణిజ్య పన్నులపై కోర్టులు, అధికారుల వద్ద ఉన్న స్టేలను ఎత్తి వేయటం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామని వెల్లడించారు. ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల అమలుపై అనుమానాలు, సందేహాలు అక్కర్లేదన్నారు. ఆదివారం సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాక్‌లో యనమల ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బడ్జెట్ తయారీకి సంబంధించి ప్రతిపాదనలు పంపాల్సిందిగా వివిధ శాఖలకు రాసిన లేఖపై తొలి సంతకం చేశారు. కొద్దిసేపు ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఎస్పీ సింగ్, అజయ్ కల్లాం, పీవీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యనమల విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచుకోవటంతో పాటు మరోవైపు ప్రజలపై భారం పడకుండా చూసుకోవటం తమ ప్రథమ కర్తవ్యమని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వనరులు, ఆదాయం, వ్యయం క్లిష్టంగా ఉన్నాయని, వీటిని సరిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ద్రవ్యలోటు ఎక్కువగా ఉందని, దాన్ని తగ్గించేందుకు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలు సవరించాల్సిందిగా కేంద్రాన్ని కోరతామని వెల్లడించారు. ఫలితంగా ద్రవ్యలోటు తగ్గిపోయి ప్రభుత్వం తీసుకునే చర్యలతో మిగులు ఏర్పడుతుందని, గ్రాంట్లు వస్తాయని వివరించారు. రాష్ర్టంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఉదారంగా సాయం అందించాలని ప్రణాళికా సంఘాన్ని కూడా కోరనున్నట్లు తెలిపారు. ప్రణాళికేతర వ్యయంపై గతంలో 20 శాతం కోత విధించామని, ఇక ముందు ఏం చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుందో తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్రం సాధారణ అమ్మకపు పన్ను (జనరల్ సేల్స్ టాక్స్) విధించే ఆలోచనలో ఉందని, దీన్ని కూడా తాము పరిశీలించాల్సి ఉందని చెప్పారు.