khaleel
-
నెరవేరిన సీఎం హామీ.. దివ్యాంగుడికి రూ.90,000 విలువైన..
సాక్షి, చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు చెందిన ఖలీల్ అనే దివ్యాంగుడికి సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ నెరవేరింది. ఈ ఏడాది జూలైలో వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా చింతూరు వచ్చిన ముఖ్యమంత్రిని ఖలీల్ కలిసి తనకు మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనం మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రమిచ్చాడు. దీంతో అతనికి రూ.90,000 విలువైన ఎలక్ట్రిక్ వాహనం మంజూరు చేస్తూ కలెక్టర్ సుమిత్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం వద్ద ఏవో రాజ్‌కుమార్ ఆ వాహనాన్ని ఖలీల్‌కు అందజేశారు. తనకు ఎలక్ట్రిక్ వాహనం మంజూరయ్యేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రికి ఖలీల్ కృతజ్ఞతలు తెలిపాడు. చదవండి: (నెరవేరనున్న నాలుగు దశాబ్దాల మెట్ట ప్రాంతీయుల కల) -
వాగులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
మందమర్రి: అదిలాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. జిల్లాలోని మందమర్రి మండలం తిమ్మాపూర్ కి చెందిన నరేష్, ఖలీల్ అనే ఇద్దరు చిన్నారులు గ్రామ సమీపంలోని పాలవాగులో మృత దేహాలై కనిపించారు. స్థానికులు గుర్తించి చిన్నారుల మృత దేహాలను వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ బోల్తాపడి ఒకరి మృతి
నేరేడుచర్ల: అదుపుతప్పి ఓ బైక్ బోల్తా పడగా, ద్విచక్రవాహనదారుడి తలపై నుంచి లారీ వెళ్లిపోవడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం రామగిరి వద్ద మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మిర్యాలగూడ సీతారామపురంకు చెందిన ఖలీల్ నేరేడుచర్లలో పని పూర్తి చేసుకుని బైక్‌పై తిరుగు ప్రయాణం అయ్యాడు. రామగిరి వద్దకు వచ్చేసరికి బైక్ అదుపుతప్పడంతో బండితోపాటు ఖలీల్ కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బోర్వెల్ లారీ ఖలీల్ తలపై నుంచి ముందుకు వెళ్లింది. తల ఛిద్రమై ఖలీల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.