కల్తీ మద్యం విక్రయిస్తున్న షాప్ సీజ్
- పక్కనే బ్లాక్‌లో అమ్మకాలు
- పట్టించుకోని ఎక్సైజ్‌శాఖ
కారేపల్లి: కల్తీ మద్యం విక్రయిస్తున్న కారేపల్లిలోని శ్రీ కనకదుర్గా వైన్‌షాపును మంగళవారం రాత్రి కారేపల్లి ఎక్సైజ్ సీఐ రమ్యారెడ్డి, సిబ్బందితో వచ్చి సీజ్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆమె ఈ విషయాన్ని తెలిపారు. కారేపల్లి వైన్ దుకాణంలోని మద్యం బాటిల్స్‌ను వరంగల్‌లోని లేబోరేటరీలో పరీక్షించామన్నారు. మద్యంలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయిందన్నారు.
ఖమ్మం ఎక్సైజ్ డీసీ మహేశ్‌బాబు ఆదేశాల మేరకు శ్రీ కనకదుర్గా వైన్‌షాప్‌ను సీజ్ చేశామన్నారు.
బ్లాక్‌లో ఎంచక్కా..
కారేపల్లిలోని శ్రీ కనకదుర్గా వైన్‌షాప్‌ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసినా ఎంచక్కా ఆ దుకాణం పక్కనే ఓ బడ్డీ కొట్టులో బ్లాక్‌లో మద్యం విక్రయూలు జరుపుతున్నారు. ఎక్కువ ధరలు వెచ్చించి మద్యం ప్రియులు ఇక్కడి మందును బ్లాక్‌లో కొంటున్నారు. ఈ చర్యతో ఎక్సైజ్ అధికారుల ప్రయత్నం వృథా ప్రయూసగానే మిగిలిందని పలువురంటున్నారు.