'ఏపీ శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించండి'
హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య (భద్రాచలం) మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కమిషనర్ ను కోరారు.
తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లాయని తెలిపారు. 2019 వరకు తమకు ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఈనెల 14న గవర్నర్ నరసింహన్ ను కలిశారు.