క్రీడా నైపుణ్యం వెలికి తీసెందుకు పోటీలు దోహదం.
గుడివాడ : క్రీడాకారులలో ఉన్న నైపుణ్యం వెలికితీసేందుకు పోటీలు దోహదపడతాయని మున్సిపల్ చైర్మన్ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఖేలో ఇండియా జిల్లా ఖోఖో బాలబాలికల అండర్ 14, అండర్ 17 విభాగాల పోటీల టోర్నమెంట్ను మున్సిపల్ చైర్మన్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 13 నియోజక వర్గాలకు చెందిన బాలబాలికలు ఈ పోటీలకు రావటం అభినందనీయమన్నారు. సభకు జిల్లా డీఎస్డీఓ సీరాజుద్దీన్ అధ్యక్షత వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.1500 ద్వితీయ బహుమతిగా వెయ్యి రూపాయలు, మూడో బహుమతిగా రూ.500 వారి ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. మొదటి రోజు అండర్ 14 విభాగం మంగళవారం అండర్ 17 విభాగాల వారికి ఈ పోటీలు జరుగుతామని వివరించారు. కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ చోరగుడి రవికాంత్, ఎంపీడీవో కె.జ్యోతి, ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మడకా ప్రసాద్ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.