ఖోఖో విజేత ఎస్కేపీ జట్టు
– షటిల్ బ్యాడ్మింటన్ విన్నర్స్ ఎస్ఎస్బీఎన్ జట్టు
– ఫుట్‌బాల్ ఫైనల్స్‌లో∙అనంతపురం ఆర్ట్స్, పీవీకేకే జట్లు
గుంతకల్లు టౌన్ : ఎస్కేయూ గ్రూప్–బీ టోర్నమెంట్లో భాగంగా స్థానిక ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజి క్రీడామైదానంలో శుక్రవారం జరిగిన ఖోఖో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. గుంతకల్లు ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ జట్టు ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ జట్టుపై 24–16 పాయింట్లతో విజయం సాధించింది. కాస్మొపాలిటన్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌లో ఎస్ఎస్బీఎన్ జట్టు 2–0 స్కోరుతో బుక్కపట్నం జట్టుపై విజయం సాధించింది.
గుంతకల్లు ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మధ్య జరిగిన ఫుట్‌బాల్ మొదటి సెమీఫైనల్స్‌లో ప్రభుత్వ ఆర్స్ కాలేజీ జట్టు 3–0 గోల్స్‌తో ఫైనల్స్‌కు చేరుకుంది. రెండో సెమీఫైనల్స్ మ్యాచ్ అనంతపురం పీవీకేకే, హిందూపురం సప్తగిరి yì గ్రీ కాలేజీ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పీవీకేకే జట్టు విజయం సాధించినట్లు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జ్ఞానేశ్వర్, ఫిజికల్ డైరెక్టర్ జయలక్ష్మి తెలిపారు. ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ శనివారం ఉదయం జరుగనుంది. ఎస్కేయూనివర్సిటీ స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ జెస్సీ ఈ క్రీడలను పరిశీలించారు. వివిధ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు పాల్గొని క్రీడలను వీక్షించారు.