వరదల్లో కొట్టుకుపోయిన పెళ్లి వాహనం
పెషావర్: వివాహ విందుకు వెళుతుండగా అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో వాహనం కొట్టుకుపోవడంతో 26 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో 18 మంది చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన వాయువ్య పాకిస్తాన్లో ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్‌లో శనివారం జరిగింది.
మృతదేహాలను వెలికితీసి లండీ కోటల్లో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, ఆ దేశవ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలతో 55 మంది మృతి చెందినట్లు ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.