విద్య లక్ష్యం వ్యక్తి నిర్మాణం: ప్రణబ్
సాక్షి, బెంగళూరు: విద్య లక్ష్యం వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడడంతో పాటు ,శాంతియుత సహజీవనాన్ని పెంపొందించడం, వైవిధ్యాన్ని ఆహ్వానించే తత్వాన్ని ప్రేరేపించేదిగా ఉండాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. బెంగళూరులోని ‘బిషప్ కాటన్ బాయ్స్’ స్కూలు 150వ వార్షికోత్సవ ముగింపు సభలో బుధవారం రాష్ట్రపతి ప్రసంగించారు. మరోవైపు బెంగళూరులోని కిద్వాయ్ మెమోరియల్ ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దేశంలో కేన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేన్సర్ నివారణతోపాటు, బాధితులకు నాణ్యమైన చికిత్స అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరముందని ప్రణబ్ అభిప్రాయపడ్డారు.