Kim Clijsters
-
ముచ్చటగా మూడోసారి.. ఈసారి శాశ్వత వీడ్కోలు
Kim Clijsters- న్యూజెర్సీ: గతంలో రెండుసార్లు రిటైర్మెంట్ (2007, 2012) ప్రకటించి.. ఆ తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన బెల్జియం మహిళా టెన్నిస్ స్టార్ కిమ్ క్లియ్‌స్టర్స్ ఈసారి మాత్రం శాశ్వతంగా ఆటకు వీడ్కోలు పలికింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటన విడుదల చేసింది. కాగా గత ఏడాది ఇండియన్ వెల్స్ ఓపెన్‌లో చివరిసారి బరిలోకి దిగిన 38 ఏళ్ల క్లియ్‌స్టర్స్ తన కెరీర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను (2005, 2009, 2010–యూఎస్ ఓపెన్; 2011–ఆస్ట్రేలియన్ ఓపెన్) నెగ్గింది. ఇక తన కుటుంబంతో అమెరికాలో స్థిరపడిన క్లియ్‌స్టర్స్ 2003లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. కెరీర్ మొత్తంలో 41 టైటిల్స్ నెగ్గిన క్లియ్‌స్టర్స్ 523 మ్యాచ్‌ల్లో గెలిచి, 131 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మొత్తం 2 కోట్ల 45 లక్షల 45 వేల 194 డాలర్ల (రూ. 186 కోట్లు) ప్రైజ్‌మనీని సంపాదించింది. చదవండి: IPL 2022: మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు... సిక్సర్ల సునామీతో చెన్నై బోణీ -
7 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్పై పునరాలోచన
బ్రసెల్స్: ఏడేళ్ల క్రితం టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పిన బెల్జియం భామ కిమ్ క్లియస్టర్స్ మళ్లీ కోర్టులో దిగేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. 2020లో తాను రాకెట్ పడతానంటూ తన మనసులోని మాటను వెల్లడించారు. మాజీ నంబర్ వన్, నాలుగు గ్లాండ్ స్లామ్ల విజేత అయిన క్లియస్టర్.. 2012లో టెన్నిస్‌కు గుడ్ చెప్పేశారు. ఇలా తన రిటైర్మెంట్ ప్రకటించడం రెండోసారి. అయితే రెండుసార్లు రిటైర్మెంట్ తీసుకున్న క్లియస్టర్కు ఆటపై మక్కువ తగ్గలేదు. మళ్లీ టెన్నిస్ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే టెన్నిస్ ఆల్ హాఫ్ ఫేమ్‌లో సభ్యురాలైన క్లియస్టర్.. వచ్చే ఏడాది టెన్నిస్ రాకెట్ పట్టడమే లక్ష్యం అంటున్నారు. ‘నా లక్ష్యం ఇప్పుడు ఫిట్నెస్ సాధించడంపైనే ఉంది. అత్యుత్తమ స్థాయిలో టెన్నిస్ ఆడాలంటే ఫిట్నెస్ను కాపాడుకోవాలి. ఇది నా చాలెంజ్. నన్ను నేను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి సారించా. ఇది చాలా కష్టంతో కూడుకున్న నిర్ణయం. నేను కనీసం ఒక గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగడానికి కసరత్తు చేస్తున్నా. ఇందుకోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంది’ అని క్లియస్టర్ పేర్కొన్నారు. 2007లో వరుస గాయాల కారణంగా ఆట నుండి తప్పుకుంది. ఏడాది తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఈ మాజీ నెంబర్ వన్ 2009లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. పునరాగమనం చేసిన ఏడాదిలోనే యుఎస్ ఓపెన్ గెలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. గ్రాండ్‌శ్లామ్ గెలిచిన తల్లిగా రికార్డులకెక్కారు క్లియస్టర్స్. 2010లోనూ అదే జోరు కొనసాగించిన క్లియస్టర్స్ మళ్ళీ యుఎస్ ఓపెన్ నిలబెట్టుకున్నారు. ఇలా వరుసగా రెండేళ్ళు గ్రాండ్‌శ్లామ్స్ గెలిచిన తల్లిగా చరిత్ర సృష్టించారు. 2003లో ఏడాది పాటు నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న క్లియస్టర్స్ డబుల్స్‌లోనూ అగ్రస్థానం సాధించారు. -
స్కర్ట్ వేసుకున్న ఫ్యాన్.. ఆమెకు నవ్వాగలేదు!
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ చరిత్రలోనే శుక్రవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మహిళల డబుల్స్ మ్యాచ్‌ల కోసం నిర్వహించిన సన్నాహక మ్యాచ్‌లో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు బెల్జియం క్రీడాకారిణి కిమ్ క్లియస్టర్స్ చేసిన ఓ ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది. నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయిన క్లియస్టర్స్ ఆడియన్స్ గ్యాలరీ నుంచి పెద్దగా అరుపులు వస్తున్న వైపు చూసింది. తన సర్వీస్‌ను లిఫ్ట్ చేస్తారా అని అడగగా ఓ అభిమాని ఆసక్తిచూపగా అతడిని కోర్టులోకి ఆహ్వానించింది. అయితే వింబుల్డన్ రూల్స్ ప్రకారం టెన్నిస్ కోర్టులో ఆడే ప్లేయర్ కచ్చితంగా వైట్ అండ్ వైట్ డ్రెస్సులో ఉండాలి. కోర్టులోకి వచ్చిన వ్యక్తి బ్లూ షార్ట్, గ్రీన్ టీ షర్టు ధరించిన విషయాన్ని గమనించిన బెల్జియం భామ తన వద్ద అదనంగా ఉన్న ఓ స్కర్ట్, టీషర్ట్‌ను ను అతడికి ఆఫర్ చేసింది. అతడికి స్కర్ట్ తొడిగే క్రమంలో ఆమెకు విపరీతమైన నవ్వొచ్చి కోర్టులో పడిపడి నవ్వారు. క్లియ్‌స్టర్ ఇచ్చిన సర్వీస్‌ను అతడు లిఫ్ట్ చేయగానే ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందించారు. క్రీడాకారిణులతో కలిసి ఫొటోలకు నవ్వుతూ ఫోజులిచ్చాడు. వింబుల్డన్ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది