స్కర్ట్ వేసుకున్న ఫ్యాన్.. ఆమెకు నవ్వాగలేదు! | Male Fan with White Skirt in Wimbledon goes viral | Sakshi

మహిళల స్కర్ట్ ధరించి.. టెన్నిస్ కోర్టులో!

Jul 15 2017 11:57 AM | Updated on Sep 5 2017 4:06 PM

స్కర్ట్ వేసుకున్న ఫ్యాన్.. ఆమెకు నవ్వాగలేదు!

స్కర్ట్ వేసుకున్న ఫ్యాన్.. ఆమెకు నవ్వాగలేదు!

ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ చరిత్రలోనే శుక్రవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ చరిత్రలోనే శుక్రవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మహిళల డబుల్స్‌ మ్యాచ్‌ల కోసం నిర్వహించిన సన్నాహక మ్యాచ్‌లో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు బెల్జియం క్రీడాకారిణి కిమ్ క్లియస్టర్స్ చేసిన ఓ ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది. నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయిన క్లియస్టర్స్  ఆడియన్స్ గ్యాలరీ నుంచి పెద్దగా అరుపులు వస్తున్న వైపు చూసింది. తన సర్వీస్‌ను లిఫ్ట్ చేస్తారా అని అడగగా ఓ అభిమాని ఆసక్తిచూపగా అతడిని కోర్టులోకి ఆహ్వానించింది.

అయితే వింబుల్డన్ రూల్స్ ప్రకారం టెన్నిస్ కోర్టులో ఆడే ప్లేయర్ కచ్చితంగా వైట్ అండ్ వైట్ డ్రెస్సులో ఉండాలి. కోర్టులోకి వచ్చిన వ్యక్తి బ్లూ షార్ట్, గ్రీన్ టీ షర్టు ధరించిన విషయాన్ని గమనించిన బెల్జియం భామ తన వద్ద అదనంగా ఉన్న ఓ స్కర్ట్‌, టీషర్ట్‌ను ను అతడికి ఆఫర్ చేసింది. అతడికి స్కర్ట్‌ తొడిగే క్రమంలో ఆమెకు విపరీతమైన నవ్వొచ్చి కోర్టులో పడిపడి నవ్వారు. క్లియ్‌స్టర్ ఇచ్చిన సర్వీస్‌ను అతడు లిఫ్ట్ చేయగానే ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందించారు. క్రీడాకారిణులతో కలిసి ఫొటోలకు నవ్వుతూ ఫోజులిచ్చాడు. వింబుల్డన్ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement