అశోకుని జనన, మరణ తేదీలు తెలపండి
న్యూఢిల్లీ: మౌర్య వంశ మూడో చక్రవర్తి అశోకుని జనన, మరణ తేదీలను వెల్లడించాలని కోరుతూ అరుణ్ కుమార్ అనే వ్యక్తి కేంద్ర సమాచార కమిషన్లో దరఖాస్తు దాఖలు చేశారు. వీటితో పాటు అశోకుని జయంతి, వర్ధంతులను ప్రభుత్వం నిర్వహించిందా? దీనికి సంబంధించి ప్రణాళిక ఏమైనా ఉందా? వంటి వివరాలను తెలపాలని కోరినట్లు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్కే మాథుర్ పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం ఇవ్వాల్సిందిగా కేంద్ర హోం శాఖ, సాంస్కృతిక శాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖల కార్యదర్శులను కోరామన్నారు.