ఐఏఎస్ శిక్షణా కాలం తగ్గింపు!
న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారుల శిక్షణా కాలాన్ని తగ్గించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఐఏఎస్ ల శిక్షణాకాలాన్ని 103 వారాల నుంచి 75 వారాలకు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. కిరణ్ అగర్వాల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ ప్రతిపాదనలు చేసింది.
ఐఏఎస్ ప్రొఫెసనల్ కోర్సు(పేజ్ 1, 2)కు 7 వారాలు, అకాడమిక్ ఇన్స్ట్రక్షన్ కు 4 వారాలు, జిల్లా శిక్షణకు 21 వారాలు ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని అమలు చేయాలంటే 1954 నాటి ఐఏఎస్(ప్రొబెషన్) చట్టానికి సవరణ చేయాల్సివుంటుంది.
శిక్షణా కాలాన్ని తగ్గిస్తూ కేంద్రం చేసిన ప్రతిపాదనలపై స్పందనలు, అభిప్రాయాలు నవంబర్ 30లోగా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాలను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) శుక్రవారం కోరింది. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమాచారం ఇచ్చింది.