కలిసుందామంటూ తీసుకెళ్లి కత్తితో దాడి..
రంగారెడ్డి(షామీర్పేట): కులాంతర వివాహం చేసుకున్న ఓ యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. వివరాలు..ఎల్బీనగర్లో బీఎన్ రెడ్డినగర్కు చెందిన కిరణ్ యాదవ్(23) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన దీపికా రెడ్డి అనే యువతిని ఇంట్లో తెలియకుండా ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఏమైందో ఏమో కానీ సోమవారం సాయంత్రం సమయంలో యువతి బంధువులు కలిసి ఉందామని చెప్పి ఇంటికి తీసుకెళ్లే సమయంలో షామీర్పేటలోని కట్టమైసమ్మ రాజీవ్ రహదారి వద్ద యువకుడిపై కత్తితో దాడి చేశారు.
ఈ దాడిలో కిరణ్ ఛాతీపై , కాలిపై గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ కిరణ్ వారి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. యువకుడు ప్రస్తుతం ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.యువకుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.