Kiro Sin
-
అక్కడ తాగే నీటిలో అత్యధిక స్థాయిలో డీజిల్, కిరోసిన్ ఉన్నాయట!
కెనడా: గ్రీన్‌ల్యాండ్‌కి సరిహద్దుగా ఉన్న కెనడాకి ఉత్తర ప్రాంతమైన నునావుట్ రాజధాని ఇకాలూయిట్‌లో భూగర్భ జలాల్లోని తాగు నీటిలో అధిక శాతం ఇంధన ఆయిల్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ల్యాబ్ అధికారులు ఆ నగరంలోని వాటర్ ట్యాంక్ నుంచి సేకరించిన తాగు నీటిలో ఇంధన ఆయిల్లు అధిక స్థాయలో ఉన్నట్లు నిర్థారించారు. (చదవండి: అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు) ఈ సందర్భంగా ఇకాలుయిట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీ అమీ ఎల్గర్స్మా మాట్లాడుతూ...."భూగర్భ జల కాలుష్యం కారణంగా ట్యాంక్‌లోని నీటిలో అధికంగా ఇంధన వాసన వస్తుండవచ్చు. బహుశా ఆ వాసన డీజిల్ లేదా కిరోసిన్‌కి సంబంధించిన వాసన కావచ్చు. సురక్షితమైన నీరు అందుబాటులోకి వచ్చేంత వరకు ఈ నీటిని ప్రజలు ఉపయోగించవద్దు. నీటిని కాచినప్పటికీ ఆ వాసన పోదని పైగా మీరు మీ ట్యాంకులోని నీటిని ఎప్పటి నుంచి వినయోగించుకోవచ్చో కూడా మేమే తెలియజేస్తాం" అని అన్నారు. ఈ మేరకు ఈ నీటిని వినియోగిస్తే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పై అత్యంత ప్రభావం చూపే అవకాశం ఎక్కువ అంటూ నునావుట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మైఖేల్ ప్యాటర్సన్ ప్రజలను హెచ్చరించారు. తాగు నీటి సమస్య ఒక తీరని సమస్యగా ఉందంటూ..కెనడా లిబర్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. 2015లో అన్ని మరుగు నీటి సమస్యలను పరిష్కిరిస్తానన్న హామీతోనే జస్టిన్ ప్రధానిగా ఎన్నికవ్వడం గమనార్హం. (చదవండి: నేను మా ఆంటీకి గుడ్ బై చెప్పొచ్చా!) -
నీటిసంపులో కిరోసిన్
దుండగుల దుశ్చర్య ప్లాంట్‌కు నిలిచిన నీటి సరఫరా కాలనీవాసులకు తప్పని ఇబ్బందులు అసలే ఎండల తీవ్రతకు తాగునీరు దొరకని పరిస్థితి.. ఇలాంటి సమయంలో కొందరు దుండగులు ఓ సంపులో కిరోసిన్‌ను కలిపి కలకలం సృష్టించారు.. దీంతో స్థానికులతోపాటు ప్లాంట్ నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు.. గద్వాల : పట్టణంలోని పాతహౌసింగ్బో ర్డు కాలనీ ప్రజలకు ఆరేళ్లుగా స్మార్ట్ ఆక్వా సంస్థ నిర్వాహకులు శుద్ధి చేసిన తాగునీ టిని అందజేస్తున్నారు. దీనికోసం పక్కనే ఉన్న సంపు నుంచి నీటిని తీసుకొస్తున్నా రు. కాగా, మంగళవారం అర్ధరాత్రి దుండగులు సంపునకు ఉన్న రంధ్రంలో కిరోసిన్ పోశా రు. విషయం తెలియని ప్లాంట్ సిబ్బంది బుధవారం ఉదయం ఎప్పటిలాగే తాగునీటిని అందించారు. అందులో కిరోసిన్ వాసన వస్తుండటాన్ని కాలనీవాసులు గమనించి ఆందోళనకు గురయ్యారు. దీంతో నిర్వాహకులు నీటి సరఫరాను నిలిపివేసి సంపులో కలిసిన కిరోసిన్‌ను బయటకు తోడే ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి వరకు ప్లాంట్ సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. ప్లాంట్ పనిచేయకపోవడంతో తాగునీటి కోసం కాలనీవాసులు అవస్థలు పడ్డారు. అందులో కిరోసిన్ కలపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నారు. కొందరు ఆకతాయిలు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా ఇటీవల కాలంలో ప్లాంట్ సిబ్బందికి, కాల నీలోని కొందరురికి నీటి నిర్వహణపై భేదాభిప్రాయాలు తలెత్తాయి. వీటిని మ నసులో పెట్టుకుని కిరోసిన్ కలిపి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులెవరికీ ఫిర్యాదు చేయలేదని ప్లాంట్ సిబ్బంది తెలిపారు.