నీటిసంపులో కిరోసిన్
దుండగుల దుశ్చర్య ప్లాంట్‌కు నిలిచిన
నీటి సరఫరా కాలనీవాసులకు
తప్పని ఇబ్బందులు
అసలే ఎండల తీవ్రతకు తాగునీరు దొరకని పరిస్థితి.. ఇలాంటి సమయంలో కొందరు దుండగులు ఓ సంపులో కిరోసిన్‌ను కలిపి కలకలం సృష్టించారు.. దీంతో స్థానికులతోపాటు ప్లాంట్ నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు..
గద్వాల : పట్టణంలోని పాతహౌసింగ్‌బో ర్డు కాలనీ ప్రజలకు ఆరేళ్లుగా స్మార్ట్ ఆక్వా సంస్థ నిర్వాహకులు శుద్ధి చేసిన తాగునీ టిని అందజేస్తున్నారు. దీనికోసం పక్కనే ఉన్న సంపు నుంచి నీటిని తీసుకొస్తున్నా రు. కాగా, మంగళవారం అర్ధరాత్రి దుండగులు సంపునకు ఉన్న రంధ్రంలో కిరోసిన్ పోశా రు. విషయం తెలియని ప్లాంట్ సిబ్బంది బుధవారం ఉదయం ఎప్పటిలాగే తాగునీటిని అందించారు. అందులో కిరోసిన్ వాసన వస్తుండటాన్ని కాలనీవాసులు గమనించి ఆందోళనకు గురయ్యారు. దీంతో నిర్వాహకులు నీటి సరఫరాను నిలిపివేసి సంపులో కలిసిన కిరోసిన్‌ను బయటకు తోడే ఏర్పాట్లు చేశారు.
బుధవారం రాత్రి వరకు ప్లాంట్ సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. ప్లాంట్ పనిచేయకపోవడంతో తాగునీటి కోసం కాలనీవాసులు అవస్థలు పడ్డారు. అందులో కిరోసిన్ కలపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నారు. కొందరు ఆకతాయిలు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా ఇటీవల కాలంలో ప్లాంట్ సిబ్బందికి, కాల నీలోని కొందరురికి నీటి నిర్వహణపై భేదాభిప్రాయాలు తలెత్తాయి. వీటిని మ నసులో పెట్టుకుని కిరోసిన్ కలిపి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులెవరికీ ఫిర్యాదు చేయలేదని ప్లాంట్ సిబ్బంది తెలిపారు.