పెద్దాయనకు ఘన నివాళి
కర్నూలు(ఓల్డ్‌సిటీ): దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి 15వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితోపాటు ప్రముఖనేతలు ఘనంగా నివాళి అర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి, కోట్ల సర్కిల్లోని ఆయన కాంశ్య విగ్రహానికి, కిసాన్ ఘాట్‌లో ఆయన సమాధికి పూలమాలలు, పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ మచ్చలేని నాయకుడుగా ఎదిగి జిల్లా గౌరవం పెంచిన ఘనత కోట్ల విజయభాస్కర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు, రాష్ట్ర మైనారిటీసెల్ చైర్మన్ అహ్మద్ అలీఖాన్, ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, వై.వి.రమణ, అశోక్‌రత్నం, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.