థ్రిల్ చేసే... మాంజ
కిషన్ ఎస్.ఎస్, అవికా గోర్, దీప్ పాఠక్, నరేష్ డింగ్రీ, ఈషా డియోల్ కాంబినేషన్లో కిషన్ ఎస్.ఎస్. దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘ఫుట్‌పాత్-2’ తెలుగులో ‘మాంజ’ పేరుతో రానుంది. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసిన అవికా గోర్ మాట్లాడుతూ - ‘‘ఇది డిఫరెంట్ మూవీ. ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. కిషన్ మాట్లాడుతూ - ‘‘బాల నేరస్థుల దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకుని ‘ఫుట్‌పాత్ -2’ కథ తయారు చేశాం.
ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్ జనరల్ కేటగిరీలో లేటరల్ ఎంట్రీ కోసం సబ్మిట్ చేశాం’’ అని తెలిపారు. అవికా గోర్‌తో ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమా చేస్తున్న టైమ్‌లో ఈ కాన్సెప్ట్ విని థ్రిల్ అయ్యామనీ, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామనీ నిర్మాతలు తెలిపారు.