breaking news
Kishkindhapuri Movie
-
'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)
-
అనిల్ రావిపూడి- మెగాస్టార్ కాంబో.. డైరెక్టర్ బాబీ ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ డైరెక్టర్ బాబీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కిష్కింధపురి సక్సెస్ఫుల్ ఈవెంట్‌కు హాజరైన ఆయన మెగాస్టార్ చిరంజీవి సినిమాపై మాట్లాడారు. అనిల్ రావిపూడి- చిరంజీవి కాంబోలో వస్తోన్న మనశంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్ కొట్టబోతోందని అన్నారు. ఈ మూవీలోని కొన్ని సీన్స్ నేను చూసి ఈ మాట చెబుతున్నానని బాబీ పేర్కొన్నారు. మెగాస్టార్ ఖాతాలో మరో హిట్ ఖాయమని చెప్పారు.అంతకుముందు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్‌పై ఫన్నీ కామెంట్స్ చేశారు. అనుదీప్, అనిల్ రావిపూడితో కలిసి కిష్కింధపురి సినిమా చూశామని తెలిపారు. అయితే ఈ సినిమాలో చూసినప్పుడు అనుపమ కనిపించగానే అనుదీప్ అరుస్తూనే ఉన్నాడని అన్నారు. ఇదీ చూసి ఏంటి ఇలా అరుస్తున్నాడు.. అదేంటో మాకు అర్థం కాలేదు..మనం హీరో వస్తే కదా అరవాలి.. ఇతనేంటి అనుపమ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ హా ఏంటి అనుకున్నా అంటూ నవ్వులు పూయించాడు. కాగా.. ఇటీవల విడుదలైన కిష్కింధపురి చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. #ManaShankaraVaraPrasadGaru సినిమా పెద్ద హిట్ కొట్టబోతుంది - Director #Bobby#Chiranjeevi #AnilRavipudi #Kishkindhapuri pic.twitter.com/ElqNM3Frwj— Telugu FilmNagar (@telugufilmnagar) September 18, 2025 -
ఇక నటనపైనే ఫోకస్: శాండీ
‘‘లియో, లోక, కిష్కింధపురి’... ఇలా వరుసగా నేను నటించిన చిత్రాలు హిట్ అయినందుకు హ్యాపీగా ఉంది. నా చిన్నప్పుడు అందరూ నా కళ్లను చూసి, ‘డెత్ గోట్ ఐస్’ అని ఆటపట్టించేవారు. ఆ కళ్లు నచ్చే ‘లియో’కు లోకేశ్‌గారు నన్ను నటుడిగా ఎంపిక చేసుకున్నారు’’ అన్నారు కొరియోగ్రాఫర్–యాక్టర్ శాండీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా, శాండీ మాస్టర్ విలన్‌గా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా శాండీ మాస్టర్ మాట్లాడుతూ– ‘‘కిష్కింధపురి’ సినిమా కోసం లుక్ టెస్ట్ చేసి, ఫైనల్‌గా దివ్యాంగుడు లుక్‌ను ఓకే చేశాం. ఓ సీన్లో డమ్మీ సిలిండర్‌తో హీరో నన్ను కొట్టాలి. కానీ అనుకోకుండా నిజమైన సిలిండర్‌తో కొట్టడంతో నా తలకు దెబ్బతగిలింది.ఎమ్ఆర్ఐ స్కానింగ్ తీశారు. ఇప్పుడు బాగానే ఉంది. ఇక ‘కూలీ’లోని ‘మోనికా..పాట, ‘విక్రమ్’లోని పాతల...పాతల’, ‘ఓజీ’ సినిమాలోని ఓ ప్రమోషనల్ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేశాను. ఇప్పుడు నా ఫోకస్ అంతా యాక్టింగ్పైనే. ప్రస్తుతంపా. రంజిత్ నిర్మాణంలో హీరోగా ఓ సినిమా, మలయాళ ‘కథనార్’లో విలన్ రోల్ చేస్తున్నాను’’ అని చెప్పారు. ‘కిష్కింధపురిని’ అందరూ చూడాలి: చిరంజీవి ‘కిష్కింధపురి’ని హీరో చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించి, ఓ వీడియో విడుదల చేశారు. ‘‘నా రాబోయే చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ నిర్మాత సాహు గారపాటిగారు నిర్మించిన ‘కిష్కింధపురి’ మంచి విజయాన్ని సాధించింది. హారర్ సినిమాలంటే భయాన్ని ఎలివేట్ చేస్తూ దెయ్యం కథ చెబుతుంటారు. కానీ, ఈ సినిమాలో హారర్‌తోపాటు మంచి సైకలాజికల్పాయింట్ని యాడ్ చేసి చెప్పడం చాలా బాగుంది. శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం ప్రమాదకరమని చెప్పారు డైరెక్టర్ కౌశిక్. ఈ సినిమా ద్వారా సాయి శ్రీనివాస్, అనుపమ మంచి హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు. చేతన్ మ్యూజిక్ బాగుంది. ఈ సినిమాని అందరూ చూడాల్సిన అవసరం ఉంది’’ అని చిరంజీవి పేర్కొన్నారు. -
స్టార్ కొరియోగ్రాఫర్.. సైకో పాత్రలతో కేరాఫ్.. ఇతడెవరో తెలుసా?
సాధారణంగా కొరియోగ్రాఫర్స్ అనగానే దాదాపు తెర వెనకే ఉంటారు. అప్పుడప్పుడు మాత్రమే తెరపై కనిపిస్తుంటారు. కానీ ఇతడు మాత్రం ఓవైపు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు సైకో విలన్‌గా తెగ భయపెడుతున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీసెంట్ టైంలో వచ్చిన సినిమాల్లో సైకో పాత్రలతో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇంతకీ ఎవరితడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?శాండీ మాస్టర్ అలియాస్ సంతోష్ కుమార్.. తమిళ ఇండస్ట్రీకి చెందిన కొరియోగ్రాఫర్ కమ్ నటుడు. చెన్నైకి చెందిన ఇతడు.. 2005లో డ్యాన్స్ మాస్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. తెలుగులోనూ ఓంకార్ హోస్ట్ చేసిన ఛాలెంజ్ షోలో కొరియోగ్రాఫర్‌గా చేశాడు. రీసెంట్ టైంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'మోనికా' పాటకు ఇతడే స్టెప్పులు కంపోజ్ చేశాడు. అంతకు ముందు విక్రమ్, థగ్ లైఫ్, ఆవేశం, తంగలాన్ తదితర సినిమాలకు పనిచేశాడు.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)ఇక నటన విషయానికొస్తే.. లోకేశ్ కనగరాజ్ 'లియో' సినిమా ప్రారంభంలో చాక్లెట్ కాఫీ అంటూ నవ్వుతూనే భయపెట్టి సైకో విలన్‌గా చేసింది ఇతడే. ఈ మూవీతో చాలా క్రేజ్ వచ్చింది. అలా రీసెంట్ మలయాళ హిట్ 'లోక: ఛాప్టర్ 1'లోనూ నాచియప్ప అనే ప్రతినాయక పాత్ర చేశాడు. తాజాగా రిలీజైన తెలుగు మూవీ 'కిష్కింధపురి'లోనూ విస్త్రవ పుత్ర అనే సైకో పాత్ర చేశాడు. రీసెంట్ టైంలో ఇలా వరసగా సైకో పాత్రలే చేస్తున్నాడు గానీ ప్రతిసారి తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు.ప్రస్తుతం శాండీ మాస్టర్ మలయాళ సినిమాలైన 'కథనార్', 'బాబాబా'ల్లో లీడ్ రోల్స్ చేస్తుండటం విశేషం. ఇలా ఓవైపు కొరియోగ్రాఫీ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. మరోవైపు విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని భయపెడుతూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. శాండీ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తమిళ నటి కాజల్ పశుపతిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. కానీ మూడేళ్లకే వీళ్లు విడాకులు తీసుకున్నారు. తర్వాత 2017లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దొరతి స్లవియాని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. (ఇదీ చదవండి: 'మిరాయ్'తో తేజ సజ్జా ఇండస్ట్రీ రికార్డ్) -
'మిరాయ్'తో పోటీ.. 'కిష్కింధపురి' తొలిరోజు కలెక్షన్ ఎంత?
ఈ శుక్రవారం రెండు తెలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఒకటి తేజ సజ్జా 'మిరాయ్' కాగా.. మరొకటి బెల్లంకొండ శ్రీనివాస్ 'కిష్కింధపురి'. అయితే ఈ రెండింటికీ యునానిమస్ హిట్ టాక్ ఏం రాలేదు. కొందరికి ఈ చిత్రాలు నచ్చగా.. మరికొందరు మాత్రం రెండూ యావరేజ్‌గానే ఉన్నాయని అంటున్నారు. కలెక్షన్ విషయానికొస్తే 'మిరాయ్'కి రూ.27.20 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అధికారికంగానే వెల్లడించారు.(ఇదీ చదవండి: Bigg Boss 9 డేంజర్ జోన్లో వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?)మరోవైపు 'కిష్కింధపురి' టీమ్ నుంచి అధికారిక ప్రకటన అయితే ఏం లేదు. కానీ తొలిరోజు ఈ చిత్రానికి ఓ మాదిరి వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగులో మాత్రం ఈ చిత్రం రిలీజ్ కాగా.. దేశవ్యాప్తంగా రూ.2 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ సమాచారం. ప్రస్తుతానికి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం కాస్తోకూస్తో ఎంటర్టైన్ చేస్తోంది. అయితే 'మిరాయ్' వల్ల కాస్త నంబర్స్ తగ్గొచ్చు గానీ 25వ తేదీ వరకు చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలేం లేవు. ఇది 'కిష్కింధపురి'కి ఏమైనా ప్లస్ అవుతుందేమో చూడాలి.'కిష్కింధపురి' విషయానికొస్తే.. రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి(అనుపమ) లవర్స్. ఓ సంస్థలో పనిచేస్తుంటారు. ఘోస్ట్ వాకింగ్ టూర్స్ పేరుతో కొందరిని హాంటెడ్ ప్లేసులకు పట్టుకెళ్తుంటారు. ఓ సందర్భంలో ఊరికి చివరలో ఉన్న 'సువర్ణమాయ రేడియో స్టేషన్'కి వెళ్లొస్తారు. అలా వెళ్లొచ్చిన 11 మందిలో ముగ్గురు చనిపోతారు. దీంతో అసలు ఎందుకు ఇలా జరుగుతుందా అని రాఘవ్ కనుక్కొనే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ రేడియో స్టేషన్లో ఉన్న దెయ్యం ఎవరు? చివరకు రాఘవ్ అతడితోపాటు వెళ్లిన వాళ్లు బతికారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?) -
తెలుగు ప్రేక్షకులు గొప్పోళ్లు.. గొప్ప చిత్రాన్ని కాపాడతారు: బెల్లంకొండ
‘‘కిష్కింధపురి’ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. గురువారం మూడు ప్రీమియర్ షోలు వేద్దామనుకుని, మొదలైన మా సినిమాకు 66 షోలు పడ్డాయి. ఆర్గానిక్‌గా మా సినిమా ఆడియన్స్‌కు చేరువైంది. మా ‘కిష్కింధపురి’కి వారి ప్రేమ దక్కింది. ఈ ప్రేమ కొనసాగుతుంది. తెలుగు ప్రేక్షకులు గొప్పోళ్ళు. గొప్ప చిత్రాన్ని కాపాడతారు’’ అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదలైంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే కృషితో చేసిన సినిమా ‘కిష్కింధపురి’. సాహుగారు ఎంతగానో సపోర్ట్ చేసి, ఈ సినిమాను నిర్మించారు. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘మేము అనుకున్నదానికంటే డబుల్ ఇంపాక్ట్ రెస్పాన్స్ వస్తోంది. మా బ్యానర్లో మంచి సినిమా పడింది’’ అని తెలిపారు సాహు. ‘‘ఫస్ట్ టైమ్ హిట్ కొట్టినప్పుడు ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ మూమెంట్స్‌ని నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను’’ అని పేర్కొన్నారు కౌశిక్. ‘‘ప్రేక్షకుల స్పందన మా సినిమాకు గొప్ప బలాన్నిచ్చింది’’ అని చెప్పారు చేతన్ భరద్వాజ్. -
'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కిష్కింధపురి మూవీ హిట్టా.. ఫట్టా..!
-
'కిష్కింధపురి' సినిమా రివ్యూ
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ సినిమా 'కిష్కింధపురి'. ఇది ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందుకు తగ్గట్లే ట్రైలర్, పోస్టర్స్ లాంటివి కాస్త ఆసక్తికరంగా అనిపించాయి. మరి మూవీ టీమ్ చెప్పినట్లు ఈ చిత్రం భయపెడుతూ థ్రిల్ చేసిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా)కథేంటి?రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ప్రేమికులు. మరో స్నేహితుడితో కలిసి ఘోస్ట్ వాకింగ్ టూర్స్ చేస్తుంటారు. దీనికి బయట నుంచి కొందరు వ్యక్తులు వస్తుంటారు. వీళ్లందరూ కలిసి జన సంచారం లేని కొన్ని ప్రదేశాలకు వెళ్తుంటారు. ఓ సందర్భంలో 'సువర్ణమాయ' అనే పాడుబడ్డ రేడియో స్టేషన్‌కి 11 మంది వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లొచ్చిన తర్వాత ఊహించని రీతిలో ముగ్గురు చనిపోతారు. అనంతరం ఈ బృందంలోని ఓ చిన్నారి.. దెయ్యానికి టార్గెట్ అవుతుంది. ఇంతకీ వీళ్లని చంపుతున్న దెయ్యం ఎవరు? రాఘవ ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సినిమా ప్రమోషన్స్‌లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మూవీ మొదలైన 10 నిమిషాల తర్వాత ఎవరూ ఫోన్ కూడా పట్టుకోరు, ఒకవేళ అలా ఎవరైనా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తానని ఛాలెంజ్ చేశాడు. తర్వాత దీన్ని కవర్ చేసుకున్నాడు అదే వేరే సంగతి. మరి హీరో చెప్పినట్లు సినిమాలో అంత సీన్ ఉందా అంటే ఓ మాదిరిగా ఉంది అంతే!హారర్ సినిమా అనగానే స్టోరీలో ఓ స్టైల్ ఉంటుంది. దాదాపు దాన్ని ఫాలో అవుతూనే 'కిష్కింధపురి' కూడా తీశారు. ఫస్టాఫ్ అంతా దెయ్యం ఎలిమెంట్స్ చూపిస్తూ భయపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అది పార్ట్స్ పార్ట్స్‌గానే వర్కౌట్ అయింది. దెయ్యం వెనకున్న ఫ్లాష్ బ్యాక్ చెబుతూ థ్రిల్ పంచే ఎలిమెంట్స్ అన్నీ సెకండాఫ్‌లోనే ఉంటాయి. సౌండ్స్‌తో భయపెట్టడం వరకు సరే గానీ థ్రిల్లింగ్ అంశాలు మాత్రం సెకండాఫ్‌లో తగ్గిపోయాయి. సాధారణంగా హారర్ మూవీస్ అనగానే చిల్ మూమెంట్స్ కీలకం. అంటే ప్రేక్షకుల్ని సడన్‌గా భయపెట్టాలి. ఇందులో ఒకటి రెండు చోట్ల తప్పితే అలాంటి సన్నివేశాలు పెద్దగా లేవు.ప్రారంభంలో సగటు తెలుగు సినిమాల్లో ఉన్నట్లే హీరో ఇంట్రడక్షన్, లవ్ సాంగ్.. ఇలా సాగుతుంది. ఎప్పుడైతే 'సూవర్ణమాయ' రేడియో స్టేషన్లో హీరోహీరోయిన్తో అడుగుపెడతారో అసలు కథ మొదలవుతుంది. ఇందులోకి వచ్చి వెళ్లిన ఇద్దరు లోకో పైలెట్స్ని, అలానే ఓ నిర్మాణ కూలీని చంపడం లాంటి సీన్స్ రెగ్యులర్‌గానే అనిపించాయి. ఓవైపు సూవర్ణమాయ గురించి తెలుసుకునేందుకు హీరో ప్రయత్నిస్తూనే, మరోవైపు మిగతా వాళ్లు చనిపోకుండా ఆపడం లాంటి అంశాలతో సెకండాఫ్ అంతా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే స్టోరీ, ట్విస్టులు బాగున్నాయి. కానీ ఇదంతా ఎక్కడో తెలుగు సినిమాలో చూసేశామే అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎవరెలా చేశారు?బెల్లంకొండ శ్రీనివాస్ హారర్ సినిమాలో నటించడం ఇదే తొలిసారి. రాఘవ్ పాత్రలో పర్లేదనిపించాడు. హీరోయిన్ అనుపమకి మాత్రం మంచి స్కోప్ దొరికింది. మొదట్లో రెగ్యులర్ కమర్షియల్ పాత్రలానే అనిపిస్తుంది గానీ సెకండాఫ్‌లో ఈమె దెయ్యంగా మారే సీన్స్‌లో ఆకట్టుకుంది. విశ్రవ పుత్రగా శాండీ మాస్టర్ మెప్పించాడు. ప్రారంభంలో హైపర్ ఆది, సుదర్శన్ కాస్త నవ్వించేందుకు ప్రయత్నించారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. తనికెళ్ల భరణి, మకరంద్ దేశ్ పాండే తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన వాళ్లంతా ఓకే ఓకే.టెక్నికల్ అంశాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల్లో మాత్రమే ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కొన్నిచోట్ల స్టోరీలో లాజిక్స్ మిస్ కావడం డిసప్పాయింట్ చేస్తుంది. గ్రాఫిక్స్ కూడా ఇది గ్రాఫిక్స్ అని తెలిసిపోయేలా ఉంది. దాన్ని కాస్త నేచురల్‌గా చేసుండాల్సింది. దర్శకుడు భయపెడదామని బాగానే ప్రయత్నించాడు కాకపోతే పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. స్టోరీ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది!అలానే 'కిష్కింధపురి' అనే టైటిల్ పెట్టారు. ప్రారంభంలో కోతులతో ఓ సీన్ చూపించడం, సినిమాలో ఊరి పేరు తప్పితే ఎక్కడా టైటిల్‌కి స్టోరీకి కనెక్షన్ అనిపించలేదు. దీని బదులు 'సూవర్ణమాయ రేడియో స్టేషన్' అని పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది.- చందు డొంకాన(ఇదీ చదవండి: మిరాయ్ ట్విటర్ రివ్యూ) -
ఆయన కోసం కిష్కింధపురి చూస్తాను: అనిల్ రావిపూడి
‘‘నాకు హారర్ సినిమాలంటే భయం. కానీ, మా నిర్మాత సాహుగారి కోసం ‘కిష్కింధపురి’ చూస్తా’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలి పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్ల పాటి దర్శకత్వంలో సాహు గార పాటి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సానా, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సాయి శ్రీనివాస్ చాలా కష్టపడతాడు.తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిగ్ సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్‌కి ఆల్ ది వెరీ బెస్ట్. నిర్మాత సాహుగారితో ‘భగవంత్ కేసరి’ చేశాను. ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. ‘‘రాక్షసుడు’లానే ‘కిష్కింధపురి’ కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు బుచ్చిబాబు. ‘‘కిష్కింధపురి’ ట్రైలర్ అదిరి పోయింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని సుస్మిత కొణిదల. చెప్పారు. -
'కిష్కింధపురి' ట్విస్ట్.. సినిమా చూసిన వారి టాక్ ఇదే
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన చిత్రం 'కిష్కింధపురి'.. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లంకొండ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు బెల్లం బాబు.'కిష్కింధపురి' ప్రీమియర్ షోలు సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లోని AAA ముల్టీప్లెక్స్లో ప్రదర్శించారు. సినిమా చూసిన ఆడియెన్స్ టాక్ ఎలా ఉందంటే.. మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్లేందుకు టైమ్ తీసుకున్న దర్శకుడు ఎప్పుడైతే కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి అడుగుపెడతారో అక్కడ నుండి సినిమాను పరిగెత్తిస్తూ, భయపెట్టేసాడిని చెబుతున్నారు. ఫస్టాఫ్‌ను ఎటువంటి అదనపు హంగులకు వెళ్లకుండా అనుకున్న పాయింట్‌ను తెరపై అంతే చక్కగా చూపించారు. ఇక సెకెండ్ హాఫ్ కూడా అంతే గ్రిప్పింగ్‌గా హారర్ ఎలిమెంట్స్ ని ఎక్కడ తక్కువ చేయకుండా అదరగొట్టాడు డైరెక్టర్. తమిళ నటుడు శాండ నటన గూస్ బమ్స్ తెప్పిస్తాయి. బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఈ జానర్ బాగా సెట్ అయిందనే చెప్పాలి. సూపర్‌గా నటించి మెప్పించాడు. అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్ లో చేసిన పర్ఫామెన్స్ సూపర్ అనే చెప్పాలి. థ్రిల్లర్ ఎపిసోడ్స్ స్టోరీ నేరేషన్ చాలా బాగుందని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌండ్. ఎం.ఆర్. రాజా కృష్ణన్ ఇచ్చిన సౌండింగ్. హారర్ సినిమాను సౌండ్ తో ఎంత మ్యాజిక్ చేయచ్చో అంత చేసాడు. ఓవరాల్ గా చెప్పాలంటే కిష్కింధపూరి మిమ్మల్ని భయపెడుతూ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టి మరి అలరిస్తుంది. పార్ట్ 2 కోసం ఇచ్చిన లాస్ట్ మినిట్ ట్విస్ట్ చాలా బాగుంది. -
‘కిష్కింధపురి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వీడు మంచి స్టూడెంట్.. ఎగ్జామ్ పాసవుతాడు: కిష్కింధపురి డైరెక్టర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ కౌశిక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ..' మొదటి 10 నిమిషాల తర్వాత ఆడియన్స్ ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీ వదిలేస్తాను. అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెబితే నాకు భయం వేసింది. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారని రాత్రంతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సినిమా చూశాం. అస్సలు కంగారు లేదు.. మూవీ చాలా బాగా వచ్చింది. ఎవరికైనా సినిమా తీయడం అనేది ఎగ్జామ్ రాయడం లాంటిది. నేను ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ ఇచ్చింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు.. నన్ను నమ్మి నా ఎగ్జామ్ ఫీజ్ కట్టింది నిర్మాత సాహుకు.. వీడు గుడ్ స్టూడెంట్ ఎగ్జామ్‌లో పాసవుడుతాడని నమ్మడం వల్లే జరిగింది. కచ్చితంగా డిస్టింక్షన్లో పాసవుతామనే నమ్మకం ఉంది' అని అన్నారు. -
ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడు చూడలేదు : హీరో బెల్లంకొండ
నేను ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. ఆ క్రమంలో చాలా వరకూ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అయితే నాకు పర్సనల్ గా హారర్ సినిమాలంటే ఇష్టం. మా ప్రొడక్షన్ లో చేసిన కాంచన లాంటి సినిమాలు చాలా ఎంజాయ్ చేశాను.చాలా రోజుల తర్వాత నాకు నచ్చే జానర్లో కిష్కింధపురి అనే ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేసే అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఈ చిత్రం డియన్స్ కి ఒక డిఫరెంట్ థ్రిల్, సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది’అన్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన హీరోగా నటించిన తాజా హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సాయి శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...→ దర్శకుడు కౌశిక్ కు మంచి కథ రెడీ చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్స్ సినిమాలకి బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి. కానీ సాహు ఆడియన్స్ కి ద బెస్ట్ ఇవ్వాలని టెక్నికల్ గా గ్రాఫిక్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. సినిమాకి కావాల్సిన ప్రతిదీ ఇచ్చారు.ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్ గా ఉంది. సినిమాని ఇలా కూడా తీయొచ్చా అనిపించేలా చేసిన సినిమా ఇది.→ నిన్న ఫస్ట్ టైం థియేటర్స్ లో ఈ సినిమా చూసాం. అదిరిపోయింది. ముఖ్యంగా సౌండ్. సలార్ యానిమల్ కాంతారా సినిమాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్ రాధాకృష్ణ సౌండ్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ సినిమాకి అద్భుతమైన సౌండ్ డిజైన్ చేసే స్పేస్ ఉంది. హారర్ మిస్టరీ ఉన్న ఒక కొత్త జానర్ ఇది. టెక్నికల్ అద్భుతంగా ప్రజెంట్ చేశాం.→ ఈ సినిమా కథలోనే యాక్షన్ ఉంది. మొత్తం ఆర్గానిక్ గా చేసిన సినిమా ఇది. విజువల్ ఎఫెక్ట్స్ సౌండ్ పరంగా ఆడియన్స్ చాలా థ్రిల్ అవుతారు. హారర్ సినిమాలో ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడు చూడలేదు. హారర్ మిస్టరీ రెండు బ్లెండ్ అయిన సినిమా ఇది. ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.→ ఈ సినిమా కోసం సువర్ణమాయ రేడియో స్టేషన్ ని సెట్ గా వేశాం. అలాగే రియల్ వాంటెడ్ హౌస్ లో షూట్ చేశాం. అది రియల్ గా పాతబడిపోయిన బిల్డింగ్. తర్వాత వాళ్లకి కొత్త బిల్డింగ్ వేసి ఇవ్వడం జరిగింది.→ ఈ సినిమాని టీనేజ్ ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. హారర్ కారణంగా సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇంత సీరియస్ హారర్ సినిమా చూసి చాలా కాలం అయిందని సెన్సార్ సభ్యులు చెప్పడం ఆనందాన్నిచ్చింది.→ ఈ మధ్య ఏదైనా ఒక కొత్తగా చేయాలి, యాక్టర్ గా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అనే కసి పెరిగింది. ఒక కొత్త క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు సెట్లో లొకేషన్ లో ఆ ఎనర్జీ వేరుగా ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను.→ కొత్త సినిమాల విషయానికొస్తే.. టైసన్ నాయుడు షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. హైందవ షూటింగ్ చివరి దశకు వచ్చింది. సమ్మె కారణంగా బ్రేక్ పడింది కానీ ఈపాటికి షూటింగ్ అయిపోయేది. ఈ రెండు కూడా డిఫరెంట్ సినిమాలు. అలాగే పొలిమేర డైరెక్టర్ అనిల్ తో ఒక సినిమా ఉండబోతుంది. అది న్యూ ఏజ్ థ్రిల్లర్. -
నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎందుకంటే టాలీవుడ్లో సినిమాలు వస్తున్నాయి గానీ బాక్సాఫీస్ దగ్గర నిలబడట్లేదు. అయితే హిట్ లేదంటే డిజాస్టర్ అవుతున్నాయి. మరోవైపు మూవీ టీమ్ నుంచి ఎవరో ఒకరు షాకింగ్ ఛాలెంజులు చేయడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్గా నిర్మాత నాగవంశీ ఇలానే ఛాలెంజ్ చేసి ఎంత ట్రోలింగ్కి గురయ్యారో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా అలాంటి ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు.కొన్ని నెలల క్రితం 'భైరవం'తో వచ్చిన బెల్లంకొండ.. ఫ్లాప్ చవిచూశాడు. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. సెప్టెంబరు 12న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జరుగుతున్నాయి. టీమ్ అంతా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది. అయితే హీరో చేసిన కామెంట్స్ మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 తొలివారం నామినేషన్స్.. మొత్తం 9 మంది!)'రెండున్నర గంటలపాటు ప్రేక్షకులు అన్నీ మరిచిపోయి సినిమాలో లీనమయ్యే సత్తా ఈ 'కిష్కింధపురి'కి ఉంది. మూవీ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు తమ మొబైల్ పట్టుకోకపోతే చాలు మనం సక్సెస్ అయినట్లే. ఈ చిత్రం కూడా అలాంటిదే. సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత ఎవరైనా ప్రేక్షకులు తమ మొబైల్ బయటకు తీశారంటే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా' అని బెల్లంకొండ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ హీరో ఏం చేస్తాడో చూడాలి?బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన ఈ హారర్ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేయగా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ పాడుబడిన రేడియో స్టేషన్, అక్కడికి వెళ్లిన కొందరు ఔత్సాహికులు, కాసేపటికి దెయ్యం ఎంటర్, తర్వాత ఏమైంది? అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీలానే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్) -
ఆ నమ్మకంతోనే ఉన్నాం: కౌశిక్ పెగల్లపాటి
‘‘సాయి శ్రీనివాస్, అనుపమ కాంబినేషన్లో వచ్చిన ‘రాక్షసుడు’(2019) సినిమా మంచి విజయం సాధించింది. వారి కలయికలో వస్తున్న రెండో చిత్రం ‘కిష్కింధపురి’పై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. మా సినిమా ఫైనల్ ఔట్పుట్ చూశాక ఆ అంచనాలను అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. ఒక సున్నితమైన కథతో, మంచి సినిమా చేశామనే సంతోషం ఉంది’’ అని డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి చెప్పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కౌశిక్ పెగల్లపాటి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఆ తర్వాత కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. ఓ సందర్భంలో నిర్మాత సాహుగారికి ‘కిష్కింధపురి’ కథ చెప్పాను.. ఆయనకి చాలా నచ్చింది. ఆ తర్వాత శ్రీనివాస్‌గారు విని, బాగా ఎగై్జట్ అయ్యారు. ఈ సినిమా చేయడానికి అల్లు అరవింద్, బన్నీవాస్గార్లు కూడా ఒప్పుకున్నారు.హారర్, మిస్టరీ నేపథ్యంలో రూపొందిన ‘కిష్కింధపురి’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. ఈ కథకి స్ఫూర్తి రామాయణం. 1989లో కథ మొదలవుతుంది. కథ, విజువల్, టెక్నికల్‌గా ఆడియన్స్ కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని శ్రీనివాస్‌గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు చేయని పాత్రలో అనుపమ కనిపిస్తారు. సాహు గారపాటిగారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.చేతన్ భరద్వాజ్ సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. మా చిత్రంలో స్మోకింగ్, డ్రింకింగ్ సన్నివేశాలు ఉండవు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. నా తొలి సినిమాకి ద్వితీయ చిత్రానికి ఎక్కువ గ్యాప్ వచ్చింది.. అయితే ఇకపై ఆ గ్యాప్ రాకూడదని కోరుకుంటున్నా. నా తర్వాతి సినిమాకి రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అని చెప్పారు. -
ఓటీటీ చేతుల్లోకి సినిమా వెళ్లిపోయినట్లుంది : నిర్మాత
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన హారర్ మిస్టరీ మూవీ ‘కిష్కింధపురి’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సాహు గారపాటి మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. అయితే మా ‘కిష్కింధపురి’ చిత్రం మాత్రం వినూత్నంగా, విభిన్నంగా ఉంటుంది. ఒక రేడియో నుంచి వచ్చే వాయిస్, దాని చుట్టూ ఉండే హారర్ ఎలిమెంట్స్, రేడియోతో దెయ్యానికి ఉన్న కనెక్షన్ ఇవన్నీ మా సినిమాలో కొత్తగా ఉంటాయి. ఇలాంటి హారర్ థ్రిల్లర్ ఇప్పటివరకు రాలేదు. కొన్ని షాకింగ్, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉన్నాయి. బెల్లంకొండ సాయిశ్రీనివాస్గారి ప్రెజెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలోని పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. ఇక ఈ సినిమా కథ అనుకున్నప్పుడే అనుపమను హీరోయిన్గా అనుకున్నాం. అనుపమ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ చిత్రం కోసం నెల రోజులు కష్టపడి, దాదాపు రూ. 2 కోట్లతో ఓ రేడియో స్టేషన్ సెట్ వేశాం. సినిమాలోని కీలక సన్నివేశాలు ఇక్కడే జరుగుతాయి. తొలి భాగం వినోదాత్మకంగా, సెకండాఫ్‌లో సీరియస్ హారర్ ఫిల్మ్‌గా టర్న్ అవుతుంది. ‘కిష్కింధపురి’ అనే ఊర్లో జరిగే కథ కనుక ‘కిష్కింధపురి’ అని టైటిల్ పెట్టడం జరిగింది. మా సినిమా థియేటర్స్‌లో ఆడియన్స్‌ను తప్పక ఎంగేజ్ చేస్తుంది. హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాన్– థియేట్రికల్ రైట్స్ విషయంలో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఓటీటీ డీల్స్ కుదరని కారణంగా కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోతున్నాయి. సినిమాల రిలీజ్ డేట్స్ ప్రభావితం అవుతున్నాయి. చూస్తుంటే ఓటీటీ చేతుల్లోకి సినిమా వెళ్లిపోయినట్లుంది. ఇక సినీ కార్మికుల సమ్మె ప్రభావం మా బ్యానర్లో (ఈ సినిమాకు సుస్మితా కొణిదెల మరో నిర్మాత) నిర్మిస్తున్న చిరంజీవిగారి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై పడింది. కానీ ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేస్తాం. కాకపోతే అక్టోబరులో షూటింగ్ పూర్తి చేయాలనుకున్నాం. కానీ నవంబరు కల్లా పూర్తి చేస్తాం. ఓ పదిహేను రోజులు తేడా అంతే’’ అని అన్నారు. -
నన్ను ఇంతలా ఎవరు టార్చర్ చేయలేదు.. అనుపమ ఆసక్తికర కామెంట్స్
ఇటీవలే పరదా మూవీతో అలరించిన అనుపమ పరమేశ్వరన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె హీరోయిన్గా నటించిన హారర్ మూవీ కిష్కింధపురి. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే కిష్కింధపురి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు అనుపమ పరమేశ్వరన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హారర్ ఫిల్మ్స్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. నా జుట్టును చూసే ఇలాంటి సినిమాలు వచ్చాయని అనుపమ నవ్వుతూ మాట్లాడింది.అనుపమ మాట్లాడుతూ..'నాకు హారర్ జోనర్ సినిమాలంటే ఇష్టం. నా మూడేళ్ల వయసు నుంచే హారర్ మూవీస్ చూశా. నా జుట్టు చూసే ఈ అవకాశాలు వచ్చాయి అనుకుంటా. కౌశిక్ నాకు కథ చెప్పగానే చాలా నచ్చింది. అతను చెప్పిన ఫ్లో నాకు నచ్చింది. కౌశిక్‌తో పని చేయడం అద్భుతంగా అనిపించింది. స్క్రిప్ట్‌పై ఫుల్ క్లారిటీ ఉన్న వ్యక్తి. డబ్బింగ్ స్టూడియోలో ఇంతలా నన్ను టార్చర్ చేసిన తెలుగు డైరెక్టర్ మరెవరూ లేరంటూ' నవ్వుతూ చెప్పారు. కాగా.. ఈ సినిమాకు కౌశిక్ పెగళ్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. -
బెల్లంకొండ 'కిష్కింధపురి' ట్రైలర్ రిలీజ్
బెల్లంకొండ శ్రీనివాస్.. కొన్నాళ్ల క్రితం 'భైరవం' సినిమాతో వచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర ఆ మూవీ తేలిపోయింది. ఇప్పుడు హారర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదే 'కిష్కింధపురి'. సెప్టెంబరు 12న థియేటర్లలోకి సినిమా రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కాగా కౌశిక్ పెగళ్ల దర్శకుడు.(ఇదీ చదవండి: 'వీరమల్లు'కు జీఎస్టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?)ట్రైలర్ బట్టి చూస్తుంటే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. దెయ్యాలపై ఆత్రుత ఉన్నవాళ్లందరినీ ఓ దెయ్యాల భవంతికి తీసుకెళ్లి, దాని వెనకున్న కథేంటి అని చెప్పి ఆ ప్లేస్ చుట్టూ ఓ వాకింగ్ చేయిస్తారు. ఈ ప్రయాణంలో వీళ్లందరూ ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. పైట్స్ లాంటి కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ.. హైపర్ ఆది, సుదర్శన్ లాంటి వారిలో కామెడీ కూడా చేయించినట్లు ఉన్నారు. ట్రైలర్ చివర్లో అనుపమని దెయ్యంలా చూపించడం, దెయ్యాన్ని ఎదుర్కొనే శక్తిమంతుడిగా హీరోని చూపించడం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)