kishore bhajiawala
-
భారీ ఆస్తుల చాయ్‌వాలాకు ఈడీ ఝలక్!
అహ్మదాబాద్: గుజరాత్ సూరత్ కు చెందిన ఓ వ్యక్తి కేవలం టీ, స్నాక్స్ అమ్ముకుని దాదాపు రూ.650 కోట్లు కూడబెట్టడం గత డిసెంబర్ లో కలకలం రేపింది. ఆ తర్వాత వడ్డీ వ్యాపారం చేస్తూ వందల కోట్లు పోగేసిన కిషోర్ భజియావాలా అక్రమాస్తులు పెద్ద నోట్ల రద్దు తర్వాత వెలుగుచూసిన విషయం తెలిసిందే. గతంలో కొన్ని ఆస్తులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోగా.. తాజాగా రూ.1.02 కోట్లను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వారు అటాచ్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ) ఆఫ్ 2002 ప్రకారం ఈ ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఆయన అక్రమాస్తులపై ఈడీ తమ చర్యలను వేగవంతం చేసింది. మరిన్ని అక్రమాస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తన నల్ల డబ్బును తెల్లడబ్బుగా మార్చేందుకు యత్నిస్తుండగా భజియావాలా భాగోతం బయటపడింది. దీంతో గత డిసెంబర్ నెలలో ఆయన ఇంటిపై, బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ ధికారులు లెక్కచూపని రూ.10.45 కోట్ల డబ్బుతో పాటు దాదాపు రూ.400 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని గుర్తించారు. తన వద్ద ఉన్న నల్లధనాన్ని బ్యాంకు ఖాతాల్లో వేసి తిరిగి విత్ డ్రా చేసేందుకు వందల మందిని ఉపయోగించాడని ఐటీ అధికారులు గతంలోనే వెల్లడించారు. ఈ సూరత్ వడ్డీ వ్యాపారికి సంబంధించి 27 బ్యాంకు ఖాతాలు ఉండగా అందులో 20 బినామీల పేరుతో ఉన్నవే కావడం గమనార్హం. గత డిసెంబర్ చివరి వారంలో రూ.1.45 కోట్ల నగదు, రూ.1.48 కోట్ల విలువైన బంగారం, రూ.4,92,96,314విలువైన వజ్రాలు, ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కిషోర్ భజియావాలా కేసు సీబీఐ విచారిస్తోంది. -
నోట్లు రద్దు కాగానే 700మందిని వాడాడు
అహ్మదాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత తన నల్ల డబ్బును రక్షించుకునేందుకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700మందిని బ్యాంకుల వద్ద ఉపయోగించాడు. ఈ విషయం తెలుసుకొని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అతడు ఉపయోగించినవన్నీ కూడా నకిలీ బ్యాంకు ఖాతాలే. ఆ వ్యక్తి ఎవరో కాదు.. టీ, స్నాక్స్ అమ్ముకొని దాదాపు రూ.650 కోట్లు కూడబెట్టి ఆదాయపన్నుశాఖ అధికారులను అవాక్కయ్యేలా చేసిన గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన కిషోర్ భజియావాలా. ఇప్పుడు అతడి గురించి ఈ విస్మయకర విషయమైన తెలసింది. తొలుత అతడి ఇంటిపై, బంధువుల ఇంటిపై దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు మొత్తం లెక్క చూపని రూ.10.45కోట్ల డబ్బుతోపాటు దాదాపు 400 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సీబీఐ అధికారులు చేసిన విచారణలో నకిలీ ఖాతాలు సృష్టించడమే కాకుండా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత బ్యాంకుల్లో నల్లడబ్బు జమ చేయడం ఆ వెంటనే డ్రా చేసి తెల్లడబ్బుగా మార్చుకోవడం వంటి చర్యలకు దాదాపు 700 మందిని ఉపయోగించినట్లు తెలిసింది. ఇతడికి మొత్తం 27 బ్యాంకు ఖాతాలు ఉండగా అందులో 20 బినామీల పేరుతో ఉన్నవే. అయితే, ఇప్పటి వరకు అతడు ఎంత డబ్బు జమచేసి విత్ డ్రా చేశాడనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే, రూ.1,45,50,800 డబ్బు, రూ.1,48,88,133 విలువైన బంగారం, రూ.4,92,96,314విలువైన వజ్రాలు, ఇతర కోట్ల విలువైన ఆభరణాలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ విచారిస్తోంది. -
టీ స్నాక్స్ అమ్మి.. రూ. 650 కోట్లు కూడబెట్టాడు!
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వ్యక్తి కేవలం టీ, స్నాక్స్ అమ్ముకుని భారీ మొత్తంలో సంపాదించాడు. వడ్డీ వ్యాపారం కూడా చేసుకుంటున్న కిషోర్ భజియావాలా అనే వ్యక్తి వద్ద ఉన్న ఆస్తిని లెక్కించడానికి ఆదాయపన్ను శాఖ అధికారులకు రోజుల తరబడి సమయం పడుతోంది. అతడి మొత్తం ఆస్తి రూ. 650 కోట్లని ఇప్పటికి లెక్కతేల్చారు. కిషోర్ భజియావాల, అతడి కుటుంబసభ్యులు, సన్నిహితులందరి వద్ద కలిసి గుర్తించిన ఆస్తి విలువ రూ. 650 కోట్లకుపైగా ఉందని ఆదాయపన్ను శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అతడివద్ద 50 కిలోల వెండి, రూ. 1.39 కోట్ల విలువైన వజ్రాలు, రూ. 6.5 కోట్ల నగదు, కిలోల కొద్దీ బంగారం ఉన్నాయని, వీటన్నింటినీ పలు లాకర్లలో పెట్టి దాచేశాడని తెలిపారు. దాదాపు వారం రోజుల నుంచి అతడి బ్యాంకు ఖాతాలు, లాకర్లు అన్నింటినీ ఆదాయపన్ను శాఖ పరిశీలిస్తోంది. పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత కొద్ది కాలంలోనే అతడు తన ఖాతాల్లో కోటి రూపాయలకు పైగా డిపాజిట్ చేయడంతో అనుమానం వచ్చిన అధికారులు.. అతడి మీద ఓ కన్నేసి ఉంచగా బండారం మొత్తం బయటపడింది. భజియావాలా, అతడి కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం 40కి పైగా బ్యాంకు అకౌంట్లున్నాయి. అయితే అతడి ఆదాయం లెక్క ఇప్పుడు బయటపడిన 650 కోట్లతోనే ఆగకపోవచ్చని.. రాబోయే రోజుల్లో అది మరింత పెరిగే అవకాశం ఉందని ఆదాయపన్ను శాఖ అధికారులు అంటున్నారు. సూరత్ శివార్లలోని ఉధ్నా అనే ప్రాంతంలో టీ, స్నాక్స్ మాత్రం అమ్ముకునే ఈ భజియావాలా గత మూడు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నాడు. దశాబ్ద కాలం నుంచి వడ్డీ వ్యాపారం మొదలుపెట్టి అందులో భారీగా సంపాదించాడు. ఇతగాడి నెల సంపాదనే దాదాపు రూ. 15 కోట్ల వరకు ఉంటుంది గానీ, సంవత్సరానికి తాను కేవలం కోటిన్నర మాత్రమే సంపాదిస్తున్నట్లు ఆదాయపన్ను రిటర్నులలో చూపించాడని తెలిసింది.