‘కారు’ ఖరారు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసింది. దీంతో జిల్లాలో రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. తొలి విడతలో ఎనిమిది శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంగళవా రం నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ, నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు. తె లంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు నిజా మా బాద్ ఎంపీ స్థానానికి టికెట్ దక్కింది.
అందరూ ఊహించినట్లు మహారాష్ట్రలో వ్యాపారవేత్తగా స్థిరపడిన భీంరావ్ బ స్వంత్రావు పాటిల్‌కు టీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ టికెట్‌ను కట్టబెట్టారు. 2009 లో పోటీ చేసిన ఓటమిపాలైన బిగాల గణేశ్ గుప్తకు కవిత ప్రవేశంతో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి అవకాశం చే జారిపోగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. దీంతో టీఆర్ఎస్ అర్బన్ ఇన్చార్జిగా
ఉన్న బస్వ లక్ష్మీనర్సయ్యకు షాక్ ఇచ్చినట్లయ్యింది. అర్బన్ స్థానం పై కోటి ఆశలు పెట్టుకున్న ఆయనకు కవిత, బీబీ పాటిల్‌ల ఆగమనంతో భంగపాటు కలిగింది. తనకు టికెట్ కేటాయించక పోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన లక్ష్మీనర్సయ్య రెబల్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ నగర కమిటీ సభ్యులు మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.