పోస్ట్‌కార్డుతో ఫిర్యాదు చేసినా స్పందిస్తాం
విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్మన్ కె.కృష్ణయ్య
డోర్నకల్ : విద్యుత్ సమస్యలపై వినియోగదారులు పోస్ట్‌కార్డు ద్వారా ఫిర్యాదు చేసినా స్పందిస్తామని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్మన్ కె.కృష్ణయ్య తెలిపారు. స్థానిక 33/11 కేవీ సబ్‌స్టేçÙన్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఈ వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలను కలిపి ఒక ఫోరం ఏర్పాటు చేశామని, ప్రతి జిల్లాలో నెలకు రెండుచోట్ల ఫోరం చేసి విద్యుత్ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సమస్య తీవ్రత మేరకు ఫిర్యాదు చేసిన రోజు నుంచి పది రోజుల్లో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు తమ సమస్యలను పోస్ట్‌కార్డుపై రాసి ఫోరం చిరునామాకు పంపినా పరిష్కరిస్తామన్నారు. ఫోరం టోల్‌ఫ్రీ నంబర్ 18004250028కు ఫోన్ చేసి పిర్యాదు నంబర్ తీసుకుంటే తర్వాత సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఫోరం టెక్నికల్ మెంబర్ కె.ఈశ్వరయ్య, ఫైనాన్స్ మెంబర్ ఆర్.చరణ్‌దాస్, ఇండిపెండెంట్ మెంబర్ ఏ.ఆనందరావు, డీఈ బిక్షపతి, ఏడీఈ ప్రసాద్‌బాబు, ఏఏఓ కాళిదాస్మూర్తి, డోర్నకల్, కురవి, మరిపెడ ఏఈలు సూర్యభగవాన్, వెంకటరమణ, పాండు, కమర్శియల్ ఏఈ జగదీశ్వర్‌రెడ్డి, టెక్నికల్ ఏఈ ప్రణీత్ పాల్గొన్నారు.