Kobbari Matta movie
-
సంపూ రికార్డ్.. 3 రోజుల్లో రూ.12 కోట్లు!
హృదయకాలేయం సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, మరోసారి అదే రేంజ్లో దూసుకుపోతున్నాడు. గత శనివారం రిలీజ్ అయిన సంపూ సినిమా కొబ్బరిమట్ట మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. పెద్ద హీరోల సినిమాలో పోటి ఉన్నా సంపూ సినిమా కలెక్షన్ల విషయంలో సత్తాచాటటం విశేషం. ఈ సినిమా మూడు రోజుల్లో 12 కోట్ల గ్రాస్ సాదించినట్టుగా పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్లో తమ మార్క్ చూపించారు. ఆ పోస్టర్లో స్టార్ మార్క్ పెట్టి ఫ్యాన్స్ కోసం రూ. 9 కోట్ల ఫేక్ కలెక్షన్లు యాడ్ చేసినట్టుగా క్లారిటీ ఇచ్చారు. అయితే సంపూ సినిమా భారీ పోటి మధ్య మూడు కోట్ల వసూళ్లు సాధిచటం కూడా ఘనవిజయమే అంటున్నారు విశ్లేషకులు. హృదయకాలేయం సినిమా దర్శకుడు సాయి రాజేష్ నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ సినిమాకు రూపక్ రోనాల్డ్సన్ దర్శకుడు. సంపూర్ణేష్ బాబు మూడు విభిన్న పాత్రల్లో నటించిన ఈ సినిమా వీక్డేస్లోనూ స్టడీ కలెక్షన్లు సాధిస్తుండటం విశేషం. -
‘కొబ్బరిమట్ట’ ప్రీ రిలీజ్ వేడుక
-
ఏంట్రా ఈ హింస అనుకున్నాను!
‘‘కొబ్బరిమట్ట’ సినిమా రిలీజ్ విషయంలో చాలా ఆందోళనకు గురయ్యాను. చాలామంది అసలు ఈ సినిమా విడుదల అవుతుందా? అన్నారు. చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు వాళ్లే ఫోన్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పాలని చూస్తున్నారు. నేను వాళ్ల ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు’’ అన్నారు సంపూర్ణేష్‌బాబు. రూపర్ రోనాల్డ్ దర్శకత్వంలో సంపూర్ణేష్ హీరోగా సాయి రాజేష్ (స్టీవెన్ శంకర్) నిర్మించిన ‘కొబ్బరిమట్ట’ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంపూర్ణేష్ పంచుకున్న విశేషాలు. ► మాది మిట్టపల్లి. మా నాన్నగారు గోల్డ్‌స్మిత్ వ్యాపారి. నాకు చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి. నాటకాల్లో నటించాను. వెండితెరపై నన్ను నేను చూసుకోవాలనుకుంటున్న సమయంలో ‘హృదయ కాలేయం’ దర్శకుడు స్టీవెన్ శంకర్ పరిచయం అయ్యాడు. ‘నేనొక చెత్త హీరో కోసం వెతుకుతున్నా’ అన్నాడు. అలా నరసింహాచారి హీరో సంపూర్ణేష్ బాబుగా మారాడు. ఆ తర్వాత ‘సింగం 123, వైరస్’ సినిమాలు చేశా. ‘హృదయ కాలేయం’ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు బాధించాయి. ► ‘కొబ్బరిమట్ట’ చిత్రంలో పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్ అనే మూడు పాత్రల్లో నటించాను. ఈ సినిమాలో నాకు ఆరుగురు భార్యలు, ముగ్గురు చెల్లెళ్లు ఉంటారు. ► ‘హృదయ కాలేయం’ తర్వాత ‘కొబ్బరిమట్ట’ పోస్టర్ రిలీజ్ చేశాం. ఈ సినిమా బాగా ఆలస్యం కావడానికి కారణం మేం అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ కావడమే. మధ్యలో నేను బిగ్‌బాస్ షోకు వెళ్లాల్సి రావడం ఒక కారణం. చాలామంది ఆర్టిస్టులు నటించడం వల్ల వారి కాంబినేషన్ సీన్స్ తీయడానికి కష్టపడ్డాం. ఈ సినిమా జర్నీ మూడేళ్ల పాటు సాగింది. నా మొదటి సినిమా దర్శకుడు స్టీవెన్ ఈ సినిమా నిర్మించినందుకు ఆయనకు థ్యాంక్స్. ► ఈ సినిమాలో నేను మూడున్నర నిమిషాల డైలాగ్స్ చెప్పడం కోసం చాలా కష్టపడ్డాను. చదువుకోవడానికే రెండు రోజులు పట్టింది. రాయడం, వినడం, చదవడం ఇలా చాలా ప్రాక్టీస్ చేసి చెప్పాను. మంచి స్పందన లభించింది. డైలాగ్ కింగ్ మోహన్‌బాబుగారు ఫోన్ చేసి అభినందించడం హ్యాపీ. అయితే ఈ డైలాగ్ ఫస్ట్ టైమ్ నా దగ్గరకు వచ్చినప్పుడు ‘ఏంట్రా ఈ హింస’ అనుకున్నా. ► నేను హైదరాబాద్‌కు ఇంకా షిఫ్ట్ కాలేదు. నాకు ఇద్దరు కుమార్తెలు. మా ఊర్లోనే ఉందామని మా ఆవిడ చెప్పారు. అయితే నరసింహాచారి కన్నా సంపూర్ణేష్ బాబు లైఫ్ బాగుందని చెప్పగలను. సంపూర్ణేష్ బాబుగా నాకు వచ్చిన క్రేజ్‌నే వినియోగించుకోలేకపోతున్నాను. ఇక బర్నింగ్‌స్టార్ అనే ట్యాగ్‌ను నేనేం చేసుకోను. ► ఇటీవల రెండు సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నాను. కానీ ‘కొబ్బరి మట్ట’ విడుదలపై క్లారిటీ లేకపోవడంతో ఆ సినిమాలు ఆగిపోయే పరిస్థితి. ఈ సినిమాపై నా కెరీర్ ఆధారపడి ఉంది. సన్నీ లియోన్ తెలియదు మనోజ్ ‘కరెంట్‌తీగ’ సినిమాలో సన్నీ లియోన్‌తో నటించబోతున్నానగానే అందరూ అవాక్కయ్యారు. అప్పటివరకూ సన్నీ లియోన్ ఎవరో నాకు తెలియదు. సెట్లో ఆమెను చూశాను. నన్ను మనోజ్ ఆమెకు పరిచయం చేశారు. మేం పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. నాకు ఇంగ్లీష్ రాదు.. సన్నీకి తెలుగు రాదు. -
సంపూ డైలాగ్.. వరల్డ్ రికార్డ్
హృదయ కాలేయంతో బర్నింగ్ స్టార్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. ప్రస్తుతం కొబ్బరిమట్ట చిత్రంతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు సిద్దమయ్యాడు. ఎప్పుడో విడుదల కావల్సిన ఈ సినిమా.. ఎట్టకేలకు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. తాజాగా విడుదల చేసిన సింగిల్ షాట్ డైలాగ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 3.27 నిమిషాల భారీ డైలాగ్‌ను సింగిల్ షాట్లో తీసి.. వరల్డ్ రికార్ద్ నెలకొల్పినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. సంపూ ఎంతో ఇంటెన్సిటీతో చెప్పిన ఈ డైలాగ్ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. రూపక్ రోనాల్డ్సోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 10న విడుదల కానుంది. -
సంపూ సినిమాకు 233 కోట్ల కలెక్షన్లు..
హైదరాబాద్: వేటాడే ముందు వెనకడుగేసిన సింహంలా.. కొన్నాళ్లపాటు ప్రచారానికి దూరంగా సంపూర్ణేశ్ బాబు మళ్లీ జూలు విదిల్చాడు. బిగ్‌బాస్ షో తర్వాత దాదాపు కనిపించకుండాపోయిన ఈ ‘బర్నింగ్ స్టార్’ .. బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించాడు. తన తాజ చిత్రం ‘కొబ్బరిమట్ట’ తొలివారం ఏకంగా రూ.233.64 కోట్ల కలెక్లన్లు సాధించాడు. ‘అదేంటి? అసలా సినిమా రిలీజైందా?’ అనేకదా మీ డౌట్! నిజమే, సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్లు చెబితే అతను సంపూ ఎందుకవుతాడు? బాబుకు బర్త్‌డే గిఫ్ట్: ‘హృదయ కాలేయం’తో ప్రేక్షకుల ప్రేమకు సదా బానిసగా మారిన సంపూ.. ఎప్పుడో నాలుగేళ్ల కిందట మొదలుపెట్టిందే కొబ్బరిమట్ట సినిమా. రకరకాల కారణాలతో వాయిదాపడుతూ వచ్చిన ఈ స్ఫూఫ్ యాక్షన్ కామెడీని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. బుధవారం సంపూర్ణేశ్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని కొబ్బరిమట్ట యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదలచేశారు. అందులో ‘233.64 కోట్లు.. ఫస్ట్ వీక్ ఎక్స్పెక్టెడ్ గ్రాస్’ అని పేర్కొన్నారు. -
సింగర్ గా మారిన సంపూర్ణేష్‌బాబు
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు సింగర్ గా మారాడు. 'కొబ్బరి మట్ట' సినిమా కోసం గొంతు సవరించాడు. దీంతో గాయకులుగా మారిన నటుల జాబితాలో చోటు సంపాదించాడు. హీరోలు పాటలు పాడడం ఇటీవలకాలంలో ట్రెండ్ గా మారింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ పాటలు పాడి అభిమానులను అలరించారు. సంపూర్ణేష్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడు. సంపూ పాడిన పాటను ఇంటర్నెట్ లో విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నారు. 'కొబ్బరిమట్ట'లో సంపూర్ణేష్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడు అనే విభిన్న పాత్రల్లో అతడు కనిపించనున్నాడు. 'హృదయకాలేయం'తో సంచలనం సృష్టించిన సంపూర్ణేష్ 'కొబ్బరిమట్ట'తో తన హవా కొనసాగించాలని భావిస్తున్నాడు.