Kochhar
-
వయసు 18 వృత్తి పైలెట్
సాక్షి కొచ్చర్‌కు ఇప్పటి దాకా స్కూటర్ నడపడం రాదు. కారు నడపడం రాదు. కాని ఏకంగా విమానం నడపడం నేర్చుకుంది. ప్రస్తుతానికి యంగెస్ట్ కమర్షియల్ పైలెట్ రికార్డ్ సాక్షి పేరున ఉంది. సంకల్పించాను... సాధించాను అంటోంది సాక్షి. మన దేశంలో అత్యంత చిన్న వయసులో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ సాధించిన రికార్డు మైత్రి పటేల్ పేరున ఉంది. ఆమె 19 ఏళ్ల లైసెన్స్ పొందింది. ఇప్పుడు 18 ఏళ్లకే సాక్షి కొచ్చర్ ఈ లైసెన్స్ పొంది మైత్రి రికార్డును బద్దలు కొట్టింది. సరిగ్గా ఆమె 18వ పుట్టిన రోజున ఈ లైసెన్స్ పొందడం విశేషం. పదేళ్ల వయసు నుంచే సాక్షి కొచ్చర్‌ది హిమాచల్ ప్రదేశ్‌కు ముఖద్వారం వంటిదైన పర్వాను టౌన్. అక్కడ తండ్రి లోకేష్ కుమార్ కొచ్చర్‌కు ఫుట్‌వేర్ వ్యాపారం ఉంది. పదేళ్ల వయసు నుంచి కుమార్తె పైలెట్ కావాలని కోరుకుంటూ ఉంటే అతడు ్ర΄ోత్సహిస్తూ వచ్చాడు. ‘పదో క్లాసు పరీక్షలు అయ్యాక నేను పైలెట్ కావాలని మళ్లీ ఒకసారి గట్టిగా చె΄్పాను. అయితే నాకు కామర్స్ లైన్లో చదవాలని ఉండేది. లెక్కలు పెద్దగా ఇష్టం లేదు. కాని పైలెట్ కావాలంటే ఎంపీసీ చదవాలని తెలిసి ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను’ అని చెప్పింది సాక్షి. ఇంటర్ అయిన వెంటనే ముంబైలోని స్కైలైన్ ఏవియేషన్ క్లబ్లో పీపీఎల్ (ప్రైవేట్ పైలెట్ లైసెన్స్)కు కావలసిన థియరీ క్లాసులను నాలుగున్నర నెలల పాటు చదవింది సాక్షి. ఈ క్లబ్‌లోనే కెప్టెన్ ఏ.డి.మానెక్ దగ్గర ఏవియేషన్ పాఠాలు నేర్చుకుంది మైత్రి పటేల్. సాక్షి కూడా కెప్టెన్ మానెక్ దగ్గరే తొలి పాఠాలు నేర్చుకుంది. ఆ తర్వాత సీపీఎల్ (కమర్షియల్ పైలెట్ లైసెన్స్) కోసం అమెరికా వెళ్లింది. 70 లక్షల ఖర్చు అమెరికాలో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ పొందాలంటే దాదాపు 70 లక్షలు ఖర్చు అవుతుంది. అయినా సరే సాక్షి కుటుంబం ఆ ఖర్చును భరించి సాక్షిని అమెరికా పంపింది. అక్కడ మూడు నెలల పాటు సాక్షి ట్రైనింగ్‌లో పాల్గొంది. ‘ఇన్స్ట్రక్టర్ సహాయంతో విమానం నడపడంలో ఒక రకమైన థ్రిల్ ఉంది. కాని ట్రైనింగ్‌లో భాగంగా మొదటిసారి సోలో ఫ్లయిట్ (ఇన్స్ట్రక్టర్ లేకుండా) ఒక్కదాన్నే విమానం నడిపినప్పుడు కలిగిన థ్రిల్, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. ఆ క్షణం నా జీవితంలో అలాగే ఉండి ΄ోతుంది’ అని చెప్పింది సాక్షి. ‘అయితే పైలెట్ కావడం అనుకున్నంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు, సమస్యలు ఉంటాయి. నా ట్రయినింగ్లో ఒకసారి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయింది. మరోసారి రేడియో ఫెయిల్ అయింది. నేను కంగారు పడకుండా అలాంటి సమయంలో ఏం చేయాలో అది చేసి సేఫ్ లాండింగ్ చేశాను’ అని తెలిపింది సాక్షి. పైలెట్‌గా ఉద్యోగం ‘మా ఊళ్లో నేను పైలెట్ అవుతానని అంటే మా బంధువులు చాలామంది ఎయిర్ హోస్టెస్ అనుకున్నారు. అమ్మాయిలు పైలెట్లు కావచ్చునని వారికి తెలియదు. ఇవాళ మన దేశంలో ఎక్కువమంది మహిళా పైలెట్లు ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. నాకు పైలెట్‌గా ఉద్యోగం రాగానే నా కోర్సు కోసం అయిన ఖర్చు మొత్తం అణాపైసలతో సహా మా అమ్మానాన్నలకు చెల్లిస్తాను’ అంది సాక్షి. ఇంత చిన్న వయసులో లైసెన్స్ పొందిన సాక్షికి ఉద్యోగం రావడం ఎంత సేపనీ. -
5జీ సేవలకు మరింత స్పెక్ట్రం కావాలి
న్యూఢిల్లీ: 5జీ సేవలను విస్తరించాలంటే మరింత స్పెక్ట్రం అవసరమని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. కీలకమైన 6 గిగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను టెలికం సంస్థలకు కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలా జరగని పక్షంలో 5జీ సేవలను విస్తరించడం, వేగంగాను.. చౌకగాను అందించడంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని కొచర్ వివరించారు. భారీ జనాభా ఉండే ప్రాంతాల్లో.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నెట్ సర్వీస్ లను విస్తరించడానికి అత్యంత నాణ్యమైన 6 గిగాహెట్జ్ బ్యాండ్ అనువుగా ఉంటుంది. దీంతో ఈ బ్యాండ్‌లో స్పెక్ట్రం కోసం వైఫై సంస్థలు, టెల్కోల మధ్య పోటీ ఉంటోంది. నగరాల్లో విస్తృతంగా మొబైల్ నెట్‌వర్క్‌ను పెంచుకోవాలంటే 6 గిగాహెట్జ్ బ్యాండ్ కీలకమని కొచర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెలికం శాఖకు విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. దీనిపై ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటైందని వివరించారు. కాల్ డ్రాప్స్‌పై రాష్ట్ర స్థాయి డేటా సాధ్యం కాదు కాల్ అంతరాయాలకు సంబంధించి రాష్ట్రాల వారీగా డేటా ఇవ్వాలన్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశాలు ఆచరణ సాధ్యం కాదని కొచర్ పేర్కొన్నారు. యూజర్లకు ఎట్టి పరిస్థితుల్లోనైనా నాణ్యమైన సేవలను అందించేందుకు టెల్కోలు ప్రయత్నిస్తుంటాయని, కానీ ఈ సూచనలను అమలు చేయాలంటే క్షేత్ర స్థాయిలో అడ్మిని్రస్టేషన్పరంగా అనేక సవాళ్లు ఉంటాయని ఆయన చెప్పారు. నిబంధనల ప్రకారం టెలికం సేవలను ప్రస్తుతం సర్కిళ్ల వారీగా, ఎల్ఎస్ఏ (లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా)వారీగా అందిస్తున్నామని, దానికి అనుగుణంగానే డేటా కూడా ఉంటుందని కొచర్ తెలిపారు. ఇవన్నీ వివిధ జ్యూరిడిక్షన్లలో ఉంటాయి కాబట్టి రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో డేటా ఇవ్వాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాటిస్తున్న ఎల్ఎస్ఏ (లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా) స్థాయి డేటా విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని కొచర్ వివరించారు. రాష్ట్ర స్థాయి డేటా వెల్లడి ఆదేశాలపై పునరాలోచన చేయాలని ట్రాయ్‌ను సీవోఏఐ కోరినట్లు చెప్పారు. -
పవర్ఫుల్ లేడీస్ లిస్టులో ఆ ముగ్గురు
-
పవర్ఫుల్ లేడీస్ లిస్టులో ఆ ముగ్గురు
న్యూయార్క్ : ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ అధినేత చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మ ఈ ముగ్గురు బ్యాంకర్లు ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫార్చ్యూన్ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో చోటుదక్కించుకున్నారు. అమెరికాకు బయట దేశాలను ఆధారంగా చేసుకుని 50 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫార్చ్యూన్ రూపొందించింది. ఈ జాబితాలో బ్యాంకో స్యాన్టాన్డర్స్ అధినేత అన బోటిన్ మొదటి స్థానంలో నిలిచారు. ఆర్థికపరంగా, రాజకీయ పరంగా ఎలాంటి ఒడిదుడుకులు నెలకొన్నా ఎల్లప్పుడూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగే, యూరోజోన్‌లో అతిపెద్ద బ్యాంకు బ్యాంకో స్యాన్టాన్డర్స్కు బోటిన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ లిస్టులో భట్టాచార్య రెండో స్థానంలో నిలవగా.. కొచ్చర్ 5వ స్థానం, శర్మ 19 స్థానాన్ని దక్కించుకున్నారు. భారత్‌లోని అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐకు మూడేళ్లు చీఫ్‌గా నిర్వర్తించిన క్రమంలో భట్టాచార్య ప్రొపైల్ పెరిగిందని ఫార్చ్యూన్ పేర్కొంది. రఘురామ్ రాజన్ అనంతరం ఆర్బీఐ గవర్నర్‌గా భట్టాచార్యను నియమిస్తారనే వార్తలు ఓ దశలో ఊపందుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఐదు అనుబంధ సంస్థలతో పాటు భారతీయ మహిళ బ్యాంకును ఎస్బీఐలో విలీనం చేసుకునే ప్రతిపాదన కూడా ఆమెనే తీసుకోవడం విశేషం. ప్రైవేట్ రంగ బ్యాంకులో అతిపెద్దదైన ఐసీఐసీఐకు కొచ్చర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ, ప్రత్యర్థి బ్యాంకులు ఆమెను ఓ అద్భుతమైన మహిళగా భావిస్తారని ఫార్చ్యూన్ పేర్కొంది. బ్యాంకు డిజిటల్ వృద్ధిని పెంచడానికి, మహిళా ఉద్యోగులు ఓ ఏడాది ఇంటినుంచే పనిచేసుకునే అవకాశం వంటి వాటికి బాగా కృషిచేసినట్టు తెలిపింది. దేశీయంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న యాక్సిస్ బ్యాంకుకు శిఖా శర్మ సీఈవోగా ఉన్నారు. మొండిబకాయిలతో యాక్సిస్‌కు ఇబ్బందులున్నా, శర్మ వాటిని అధిగమించడానికి అన్నీ చర్యలు చేపట్టినట్టు ఫార్చ్యూన్ పేర్కొంది.