Kochi University of Science and Technology
-
కొచ్చి యూనివర్సిటీ తొక్కిసలాటకు కారణమిదే..
కొచ్చి: ఒక్కసారిగా కుంభవృష్టి కురవడం వల్లే కొచ్చి యూనివర్సిటీలో తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు చనిపోయారు. 50 మంది దాకా గాయపడ్డారు.సింగర్ నిఖితాగాంధీ కన్సర్ట్ సందర్భంగా విద్యార్థులు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో గుమిగూడినపుడు ఘటన జరిగింది. ‘ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం లోపలికి వెళ్లేందుకు బయటికి వచ్చేందుకు ఒకే గేట్ ఉంది. పాసులు ఉన్న వాళ్లను ఆ ఒక్క గేటు నుంచే బ్యాచుల వారిగా లోపలికి నిర్వాహకులు లోపలికి పంపారు. లోపలికి వెళ్లేందుకు పాసులు లేని యూనివర్సిటీకి సంబంధం లేని యువకులు పెద్ద సంఖ్యలో గేటు వద్ద వేచి ఉన్నారు. ఈ సమయంలోనే వర్షం పడింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. అక్కడున్న మెట్ల మీది నుంచి కొందరు కిందపడ్డారు. పడిపోయిన వారి మీద నుంచి విద్యార్థులు పరుగులు తీయడంతో నలుగురు చనిపోయారు’ అని పోలీసులు తెలిపారు. మృతి చెందిన విద్యార్థులను అతుల్ తంబి, అన్ రుఫ్తా, సరా థామస్, అల్విన్గా గుర్తించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 30 మంది త్వరగా కోలుకుంటున్నారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గాయపడ్డవారి చికిత్సను దగ్గరుండి పర్యవేక్షించాల్సిందిగా ఆరోగ్య మంత్రిని ఆదేశించారు. ఇదీచదవండి..నాడు కసబ్ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది? -
నీటితో మండే పొయ్యి!
నీటితో మంటలు ఆర్పవచ్చునని అందరికీ తెలుసు. కానీ... నీళ్లంటే.. రెండు వంతుల హైడ్రోజన్, ఒక వంతు ఆక్సిజన్ అని తెలిసిన వారు మాత్రం దాంతో నిప్పు ఎలా పుట్టించాలో ఆలోచిస్తారు. కోచీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని విమల్ గోపాల్, రిశ్విన్, ప్రవీణ్ శ్రీధర్ మాదిరిగా అన్నమాట. హైడ్రోజన్ బాగా మండుతుందని, ఆక్సిజన్ మంటను ఎగదోస్తుందనీ తెలిసిన వీరు... కరెంటు సాయంతో నీటిని అక్కడికక్కడే విడగొట్టి మండించగల ఓ సరికొత్త పొయ్యిని అభివృద్ధి చేశారు. ఇంకోలా చెప్పాలంటే... నీళ్లనే వంటగ్యాస్లా మార్చారన్నమాట. కోచీలోని స్టార్టప్ విలేజ్లో వీరు ఇప్పటికే ఓ ఫ్యాక్టరీ కూడా పెట్టేశారండోయ్! ముందుగా హోటళ్లకు అవసరమైన స్టవ్లను తయారు చేసి పరీక్షిస్తామనీ, ఆ తరువాత ఈ హైడ్గ్యాస్ స్టౌ అందరికీ అందుబాటులోకి తెస్తామనీ అంటున్నారు వీరు. గ్యాస్ అక్కడికక్కడే తయారవుతూండటం వల్ల రవాణా చేయాల్సిన పని లేదు.. మండి పేలిపొతుందన్న భయమూ అక్కరలేదని భరోసా కూడా ఇస్తున్నారు. చూద్దాం... ఎప్పుడు వస్తుందో ఈ నీటి గ్యాస్ స్టౌ!