బెంగళూరు వెళ్లిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెంగళూరుకు పయనమయ్యారు. తల్లిదండ్రులతో కలసి ఘజియాబాద్ లోని తన నివాసం నుండి గురువారం ఉదయం బయలు దేరారు. గత కొన్ని రోజులుగా హై బ్లడ్ షుగర్, ఎడతెరిపిలేని దగ్గుతో బాధపడుతున్న ఆయన నాచురోపతీ చికిత్స కోసం బెంగళూరు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పది రోజులపాటు కేజ్రీవాల్ బెంగళూరు లో ఉంటారు. ఆయన స్థానంలో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వర్తించనున్నారు. గత ఢిల్లీ ఎన్నికలు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆయనకు షుగర్ బాగా పెరిగిందని, గత పన్నెండు రోజులుగా 300 స్థాయినుండి తగ్గడం లేదని...ఇన్సులిన్ తీసుకున్నా.. నియంత్రణలోకి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కే జ్రీవాల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కేజ్రీవాల్ అనారోగ్యాన్ని గమనించిన ప్రధాని మోదీ బెంగళూరులోని యోగా గురువు ను సంప్రదించాల్సిందిగా సూచించిన సంగతి తెలిసిందే
ఇది ఇలా ఉంటే.. ప్రశాంత్ భూషణ్, యోగీంద్రయాదవ్ డిసిషన్ మేకింగ్ ప్యానల్ ఉంటే తాను కార్యదర్శిగా ఉండనని కేజ్రీవాల్ అన్నట్టుగా తెలుస్తోంది.