31న టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సన్మానం
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : హన్మకొండలోని హరిత హోటల్లో ఈనెల 31న టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆత్మీయ సన్మాన సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ కొలిపాక మధు తెలిపారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో దశాబ్దకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి తమ జీవితాల్లో వెలుగు నింపనున్నారని పేర్కొన్నారు. డిగ్రీ, జూనియర్ కళాశాలల లెక్చరర్లు, వైద్యు లు, పారామెడికల్, పర్యాటక, విద్యుత్, అటవీశాఖ, ఐకేపీ, రాజీవ్ విద్యామిషన్ తదితర శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారని వివరించారు.
శనివారం సాయంత్రం 5 గంటలకు జరిగే టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల సన్మానానికి కాంట్రాక్ట్ ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కృతజ్ఞత, సన్మానసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఐక్యవేదిక ప్రతినిధులు డాక్టర్ కె.శరత్, జి.రమేష్, కె.సంధ్య, డాక్టర్ భార్గవ్ శాస్త్రి, డాక్టర్ జగదీశ్వర్‌ప్రసాద్, పి.రాధాకృష్ణ, మైదం రాజు, సూర్యకిరణ్, ఆర్.రవీందర్, సీహెచ్.శివకృష్ణమోహన్, పి.అశోక్, ఎన్.జానకిరాములు, ఎన్.రాజేంద్రప్రసాద్, కె.వెంకటచెన్నారెడ్డి పాల్గొన్నారు.