kolkatha high court
-
మమత పిటిషన్‌పై 12న విచారణ
కోల్‌కతా/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ ఎన్నికలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు స్వీకరించింది. ఆగస్టు 12న ఆ పిటిషన్‌పై విచారణ జరుపుతామని బుధవారం వెల్లడించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్ష నేత సువేందు అధికారికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలియజేసింది. నందిగ్రామ్ ఓట్లకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపర్చాలని ఎన్నికల సంఘానికి(ఈసీ) సూచించింది. మమతా బెనర్జీ పిటిషన్‌ను జస్టిస్ షంపా సర్కార్ విచారించారు. మొదటగా ఈ పిటిషన్ జస్టిస్ కౌశిక్ చంద్ర వద్దకు వెళ్లినప్పటికీ, విచారణ నుంచి ఆయనే స్వయంగా తప్పుకున్నారు. దీంతో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రాజేశ్ బిందాల్ ఈ కేసును జస్టిస్ షంపా సర్కార్ ధర్మాసనానికి బదిలీ చేశారు. మమత పిటిషన్‌ను బదిలీ చేయండి నందిగ్రామ్‌లో తన గెలుపును సవాలు చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్రం వెలుపలి కోర్టుకు బదిలీ చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మమత పిటిషన్‌పై పశ్చిమ బెంగాల్ బయట విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీఈసీని కలవనున్న టీఎంసీ నేతలు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగాల్సిన అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించకపోవడంపై జూలై 15న కేంద్ర ఎన్నికల కమిషన్‌ను (సీఈసీ) కలవనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నందిగ్రామ్‌లో బీజేపీ నేత సువేందు అధికారిపై సీఎం మమతా బెనర్జీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీకి ఎన్నిక కాని వ్యక్తి రాజ్యాంగం ప్రకారం కేవలం ఆరు నెలలు మాత్రమే సీఎం పదవిలో ఉండగలరు. మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి గెలవాల్సిన అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఎదురైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు, శాసన సభ్యులు మరణించగా ఖాళీ అయిన మరో రెండు స్థానాలకు ఎన్నికలు ప్రకటించాలన్న డిమాండ్‌తో తృణమూల్ నేతలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు థర్డ్ వేవ్ వచ్చేవరకు వేచి చూస్తున్నారా? అంటూ తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ఎన్నికల కమిషన్‌ను విమర్శించారు. -
నా భర్తని హత్య చేశారు: ఎమ్మెల్యే భార్య
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రాయ్ ఆత్మహత్యపై ఆయన సతీమణి కోల్కత్తా హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త మృతిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)తో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ పథకం ప్రకారం జరిగిన హత్య అని పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ కక్షలతోనే ఎమ్మెల్యేను హతమార్చి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం కోల్కత్తా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఆమె తరుఫు న్యాయవాది బ్రిజేష్ ఝూ తెలిపారు. కాగా ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రాయ్ ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. (ఎమ్మెల్యే రాయ్ మృతికి ఉరే కారణం) ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని బిందాల్ గ్రామంలో తన నివాసానికి సమీపంలోని మార్కెట్లో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానిక సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపుతున్నారు. అయితే ఎమ్మెల్యే జేబులో లభించిన లేఖ ఆధారంగా ఆయనది ఆత్మహత్యగానే భావిస్తున్నారు. మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ సభ్యులే ఆయన్ని హత్య చేశారంటూ ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. ఆయన మృతికి ఉరే కారణమనీ, శరీరంపై ఎటువంటి ఇతర గాయాలు లేవని మంగళవారం పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. (బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మ‘హత్య’) -
హింసాత్మకంగా ఎన్నికల పోలింగ్
-
హింసాత్మకంగా ఎన్నికలు, ఐదుగురు మృతి
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగాయి. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో 5 జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. బుర్ద్వాన్, కూచ్ బెహార్, ఉత్తర 24పరగణాలు, అసన్సోల్, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. అసన్సోల్, కూచ్ బెహార్లలో నాటు బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందగా, 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక బాగ్డాలోని పోలింగ్ కేంద్రంలోకి కొందరు వ్యక్తులు చొరబడి రిగ్గింగ్‌కు ప్రయత్నించారు. దక్షిణ 24 పరగణాలు జిల్లాలో టీఎంసీ కార్యకర్తలు, తమ పార్టీ శ్రేణులపై దాడి చేసి ఇళ్లు తగులబెట్టారని సీపీఎం ఆరోపించింది. పలు చోట్ల టీఎంసీ శ్రేణులు, ఓటర్లను తీవ్ర స్థాయిలో భయపెడుతున్నాయని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక పోలింగ్ కేంద్రాలను దిగ్బంధించిన టీఎంసీ కార్యకర్తలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. కర్రలు, ఇనుపరాడ్లను పట్టుకొని ఓటర్లపై దాడులు చేశారు. ఏ పార్టీ కార్యకర్తవూ అని ఆరా తీస్తూ, తమ వాళ్లను పోలింగ్ కేంద్రాలకు పంపుతూ, మిగతా పార్టీల మద్ధతుదారులను తన్ని తరిమేశారు. కొన్ని చోట్ల బ్యాలెట్ పేపర్లను నీళ్లలో పడేశారు. అంతేకాకుండా పలుచోట్ల ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లపైన కూడా దాడులు జరిగాయి. కొన్ని చోట్ల ఓటర్లను పోలింగ్ బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కోచ్ బేహార్ జిల్లాలో సంభవించిన చిన్నపాటి పేలుడు ప్రమాదానికి సుమారు ఇరవై మంది ప్రజలు గాయపడ్డారు. దక్షిణ 24 పరంగణాల జిల్లాలో వివిధ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో మీడియా వాహనం ధ్వంసమైంది. ఈ ఎన్నికల సందర్భంగా 14 మంది తృణమూల్ కార్యకర్తలు మృతి చెందారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనగా.. గత వారం సుమారు 52 మంది చనిపోయారని బీజేపీ నేత ఒకరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో 2013 ఎన్నికల నాటి కంటే ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లయితే రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ గతవారం కోల్‌కతా హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. బ్యాలెట్ ద్వారా ఓటింగ్.. సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లకు బదులు బ్యాలెట్ పేపర్లను ఉపయోగిస్తున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా సుమారు లక్షా యాభై వేల మంది భద్రతా సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 17న వెలుడనున్నాయి. రాష్ట్రంలోని 58,692 పంచాయతీ స్థానాలకుగాను 20,000 పంచాయతీల్లో విపక్ష పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించినట్లయింది. రాష్ట్ర చరిత్రలో గత నలభై ఏళ్లలో ఇంత మొత్తంలో సీట్లు ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి. గతంలో వామపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 11 శాతం సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకుంది. అయితే గత నెల 2న పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. నామినేషన్ వేయకుండా అధికార టీఎంసీ ఇతర పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటుందని విపక్షాలు కోల్‌కతా హైకోర్టును కూడా ఆశ్రయించాయి. దీంతో కోర్టు నామినేషన్లు గడవు ఒకరోజుకు పెంచింది. కొంత మంది అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించడం, వాటిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించంగా ఎన్నికల కమిషన్ వాటిని తిరస్కరించింది. మరోవైపు ఉదయం 11 గంటల వరకు 25 శాతం పోలింగ్ నమోదైంది. 58,639 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు ఇప్పటికే సుమారు 20వేల స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తి భాన్గర్లో ఉద్రిక్త పరిస్థితులు మీడియా వాహనాన్ని ధ్వసం చేసిన ఆందోళనకారులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్, గాల్లోకి కాల్పులు జరిపిని పోలీసులు -
కోలకతా హైకోర్టు అసాధారణ తీర్పు
సాక్షి: కోలకతా: కోలకతా హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాం వాట్సాప్‌లో దాఖలు చేసిన తొమ్మిది ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చెల్లుతాయంటూ తొలిసారి అపూర్వమైన ఆదేశాలిచ్చింది. ఈ మేరకు వాట్సాప్‌లో దాఖలు చేసిన నామినేషన్లను ఆమోదించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. జస్టిస్ సుబ్రతా తాలూక్దార్ మంగళవారం ఈ కీలక అదేశాలు జారీ చేశారు. దీనిపై తదుపరి వాదనలను ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేశారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఏప్రిల్ 28. 2018 సంవత్సరానికి పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. తాము నేరుగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేయలేకపోయామని, అందుకే వాట్సాప్ ద్వారా పంపించామని పిటిషనర్లు వాదించారు. ఆఫీస్ దగ్గర తమను గంటల కొద్దీ వేచి చూసేలా చేశారని, ఆ తర్వాత కొందరు తమపై దాడి చేసి డాక్యుమెంట్లను లాక్కున్నారని ఆరోపించారు. నిజానికి నామినేషన్లు వేయకుండా కొందరు తమని అడ్డుకున్నారని పిటిషనర్లలో ఒకరైన శర్మిష్ట చౌదరి కోర్టుకు తెలిపారు. అందుకే తప్పని పరిస్థితుల్లో తాము వాట్సాప్‌లో సమర్పించాల్సి వచ్చిందని వివరించారు. దీనిపై వాదనలు విన్న కోర్టు ఈ తొమ్మిదిమంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అంగీకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇది అసాధారణ పరిస్థితుల్లో, ఒక అసాధారణ పరిష్కారంగా కోర్టు ఇచ్చినతీర్పు తప్ప.. ప్రతిసారి ఇలా వాట్సాప్‌లో నామినేషన్లు ఆమోదించే పరిస్థితి ఉండదని సీనియర్ న్యాయవాది, మాజీ రాష్ట్ర న్యాయవాది జయాంత మిత్రా వ్యాఖ్యానించారు. వ్యక్తి ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు ఉల్లంఘన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితులకు సంబంధించిన ఉత్తర్వుగా రాజ్యాంగ నిపుణుడు, సీనియర్ లాయర్ అరవింద్ దత్తార్ అభివర్ణించారు. -
డిసెంబర్ 15 వరకు వెయ్యినోటు ఓకే: కోల్‌కతా హైకోర్టు
కోల్ కతా: డిసెంబర్ 15 వరకూ రూ. వెయ్యి నోటు చెల్లు బాటు అవుతుందని కోల్ కతా హైకోర్టు ఆదేశించింది. రిజర్వు బ్యాంకు తాజాగా వెలువరించిన ఆదేశాలలో పేర్కొన్న అన్ని ప్రాంతాల్లో ఈ నోటు చెల్లుబాటుకు అవకాశం ఇవ్వాలని సూచించింది. నవంబర్ 9నాటి నోటిఫికేషన్ గడువు పొడగించాలని తెలిపింది. రద్దైన నోట్ల మినహాయింపులు అన్నింటినీ డిసెంబర్ 15 వరకూ కొనసాగించాలని తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ స్టోర్లలో రూ. వెయ్యి నోట్లను అనుమతించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.