
కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రాయ్ ఆత్మహత్యపై ఆయన సతీమణి కోల్‌కత్తా హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త మృతిపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)తో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ పథకం ప్రకారం జరిగిన హత్య అని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజకీయ కక్షలతోనే ఎమ్మెల్యేను హతమార్చి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం కోల్‌కత్తా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఆమె తరుఫు న్యాయవాది బ్రిజేష్ ఝూ తెలిపారు. కాగా ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రాయ్ ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. (ఎమ్మెల్యే రాయ్ మృతికి ఉరే కారణం)
ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని బిందాల్ గ్రామంలో తన నివాసానికి సమీపంలోని మార్కెట్‌లో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానిక సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపుతున్నారు. అయితే ఎమ్మెల్యే జేబులో లభించిన లేఖ ఆధారంగా ఆయనది ఆత్మహత్యగానే భావిస్తున్నారు. మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ సభ్యులే ఆయన్ని హత్య చేశారంటూ ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. ఆయన మృతికి ఉరే కారణమనీ, శరీరంపై ఎటువంటి ఇతర గాయాలు లేవని మంగళవారం పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. (బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మ‘హత్య’)
Comments
Please login to add a commentAdd a comment