అస్వస్థతతో గిరిజన విద్యార్థిని మృతి
బెజ్జూరు మండలం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలకు చెందిన కొమరం మమ్మీ(13) అనే 8వ తరగతి విద్యార్థిని తీవ్ర అస్వస్థతతో గురువారం మృతి చెందింది. బాలిక రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. బుధవారం వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించింది. బాలిక స్వగ్రామం బెజ్జూరు మండలం కోయపల్లి.