రెండు లారీలు ఢీ : ఒకరి మృతి
ఒంగోలు : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మలపాడు గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీలో తరలిస్తున్న పెద్ద గ్రానైట్ రాయి రహదారికి అడ్డంగా పడడంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్రేన్‌ను రప్పించి... బండరాయిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.