టీడీపీ నేతపై నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు చేయాలి
నగరం(మామిడికుదురు) : స్థానిక యువతి విత్తనాల శేషారత్నం పట్ల అసభ్యంగా ప్రవర్తించి, దౌర్జన్యం చేసిన టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు కొమ్ముల నాగబాబుపై నాన్ బెయిలబుల్ సెక్షన్‌తో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. స్థానిక మొల్లేటివారిపాలెం రామాలయం ఎదురుగా 216వ నంబర్ జాతీయ రహదారిపై రాజోలు తాలూకా శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో నాగబాబు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. యువతి పట్ల సభ్య సమాజం సిగ్గు పడే రీతిలో ప్రవర్తించిన నాగబాబును అరెస్టు చేయడం, కొన్ని గంటల్లోనే అతను బయటకు రావడం వంటి సంఘటనలు తమను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని రాజోలు తాలూకా శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు గుబ్బల సత్యనారాయణ(బాబ్జీ), కార్యదర్శి గుబ్బల శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు.
అతడిపై నాన్ బెయిల్‌బుల్ సెక్షన్లు నమోదు చేసి, మళ్లీ అతడిని అరెస్టు చేయాలని, నాగబాబును పార్టీ మండల శాఖ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వీటిపై స్పందించని పక్షంతో తాలూకా స్థాయిలో నాలుగు మండలాల పరిధిలోని శెట్టిబలిజ కులస్తులతో త్వరలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాస్తారోకోలో మామిడిశెట్టి సాయిబాబు, వాసంశెట్టి శంకర్రావు, చిట్టూరి బుల్లియ్య, నయినాల సత్యనారాయణ, చిట్టూరి బాలయోగి, యాండ్ర వీరబాబు, గెద్దాడ నాగరాజు, కట్టా అబ్బు, కాండ్రేగుల బాబి, కడలి రంగ, మొల్లేటి షణ్ముకరావు, కడలి రాంబాబు, మొల్లేటి సత్తిపండు, కడలి బాబూరావు, మొల్లేటి కృష్ణమూర్తి, వీరవల్లి చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.