Korea Open tournament
-
ప్చ్... కశ్యప్
ఇంచువాన్ (దక్షిణకొరియా): కొరియా ఓపెన్‌లో భారత సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ విజయ పరంపర సెమీఫైనల్‌తో ముగిసింది. టోర్నీలో సింధు, సైనా, సాయి ప్రణీత్ సహా మిగతా స్టార్ షట్లర్ల పోరాటం తొలి రౌండ్‌తోనే ముగిసినా... సెమీస్ వరకు వచ్చిన కశ్యప్‌కు ప్రపంచ నంబర్ వన్ కెంటో మొమోటా (జపాన్) అడ్డుకట్ట వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ ఆటగాడు 13–21, 15–21తో వరుస గేమ్‌ల్లో పరాజయం పాలయ్యాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, టాప్ సీడ్ మొమోటా 40 నిమిషాల్లో కశ్యప్‌ను ఇంటిదారి పట్టించాడు. క్వాలిఫయింగ్ రౌండ్ ద్వారా ఒక్కో అడుగు వేస్తూ వచి్చన కశ్యప్ టాప్ సీడ్ ధాటికి సెమీస్‌లో నిలువలేకపోయాడు. తొలి గేమ్ ఆరంభమైన కాసేపటికే జపాన్ ఆటగాడు 9–5తో ఆధిక్యంలోకి వచ్చాడు. మధ్యలో పాయింట్లు సంపాదించినా మొమోటా ముందు అవి సరిపోలేదు. రెండో గేమ్‌లో 7–2తో ఆధిపత్యం చాటిన టాప్‌సీడ్ కొన్ని అనవసర తప్పిదాలతో పాయింట్లు కోల్పోయాడు. ఇదే అదనుగా కశ్యప్ 11–12 స్కోరుతో దీటుగా కదిలాడు. వెంటనే తేరుకున్న జపాన్ స్టార్ వరుసగా పాయింట్లు సాధిస్తూ 19–13 స్కోరుకు చేరాడు. తర్వాత మ్యాచ్ గెలిచేందుకు అతడికి మరెంతోసేపు పట్టలేదు. కశ్యప్‌కు మొమోటా చేతిలో ఇది మూడో ఓటమి. -
సెమీస్‌లో కశ్యప్ ఓటమి
ఇంచియోన్ (దక్షిణ కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ నుంచి భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ నిష్క్రమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో కశ్యప్ 13-21, 15-21 తేడాతో ప్రపంచ చాంపియన్ కెంటో మొమాటా(జపాన్) చేతిలో పరాజయం చెందాడు. తొలి గేమ్‌ను సునాయసంగా కోల్పోయిన కశ్యప్.. తిరిగి తేరుకోలేపోయాడు. దాంతో ఓటమి తప్పలేదు. అంతకుముందు ఇరువురి మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా అందులో కూడా మొమాటాదే పైచేయిగా నిలిచింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో కశ్యప్ 24–22, 21–8తో జాన్ ఒ జార్గెన్సెన్ (డెన్మార్క్)ను చిత్తుచేసి సెమీస్‌కు చేరినా.. మొమాటా ముందు తలవంచాడు. ఇటీవల నిలకడగా ట్రోఫీలు సాధిస్తున్న మొమోటాపై కశ్యప్ సంచలనం నమోదు చేస్తాడని ఎదురు చూసిన భారత బ్యాడ్మింటన్ అభిమానికి నిరాశే ఎదురైంది. మొమోటా తాజా గెలుపుతో ముఖాముఖి ఆధిక్యాన్ని 3-0కు పెంచుకున్నాడు. ఈ ఓటమితో కొరియా ఓపెన్‌లో భారత్ పోరాటం ముగిసింది. ఇక ఫైనల్లో తెయిన్ చెన్ చు(తైవాన్)తో మొమోటో తలపడతాడు. -
సెమీస్‌లో కశ్యప్
ఇంచియోన్ (దక్షిణ కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ జోరు కొనసాగుతోంది. సహచర భారత స్టార్ షట్లర్లు తొలి రౌండ్లోనే వెనుదిరిగినా... పతకం ఆశలను సజీవంగా ఉంచుతూ కశ్యప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో కశ్యప్ 24–22, 21–8తో జాన్ ఒ జార్గెన్సెన్ (డెన్మార్క్)ను చిత్తుచేశాడు. నేటి సెమీస్ పోరులో కశ్యప్ ప్రపంచ నంబర్ వన్ కెంటో మొమాటా (జపాన్)తో తలపడతాడు. -
శ్రీకాంత్ సత్తా చాటేనా!
నేటి నుంచి కొరియా ఓపెన్ టోర్నీ సియోల్ (కొరియా): రియో ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న తొలి టోర్నమెంట్ జపాన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్... మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో కొరియా ఓపెన్‌లో బరిలోకి దిగనున్నాడు. మంగళవారం మొదలయ్యే ఈ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ తరపున మెరుున్ ‘డ్రా’లో శ్రీకాంత్‌తోపాటు సారుుప్రణీత్, అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్ పాల్గొంటున్నారు. గాయాల నుంచి కోలుకొని మళ్లీ రాకెట్ పట్టుకున్న పారుపల్లి కశ్యప్ తొలి రోజు క్వాలిఫరుుంగ్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్‌సలో 107వ స్థానానికి పడిపోరుున కశ్యప్ తొలి రౌండ్లో కో గ్యుంగ్ బో (దక్షిణ కొరియా)తో ఆడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే కశ్యప్ రెండో రౌండ్లో పనావిత్ తొంగ్నువామ్ (థాయ్‌లాండ్) లేదా కిమ్ మిన్ కీ (కొరియా)తో తలపడతాడు. ఒకవేళ కశ్యప్ మెరుున్ ‘డ్రా’కు అర్హత సాధిస్తే తొలి రౌండ్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ తియాన్ హువీ (చైనా) ప్రత్యర్థిగా ఉంటాడు. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెరుున్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో వోంగ్ వింగ్ కీ విన్సెంట్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)తో ప్రణయ్; సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో సారుుప్రణీత్; జియోన్ హయెక్ జిన్ (కొరియా)తో జయరామ్ ఆడతారు.