శ్రీకాంత్ సత్తా చాటేనా!
నేటి నుంచి కొరియా ఓపెన్ టోర్నీ
సియోల్ (కొరియా): రియో ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న తొలి టోర్నమెంట్ జపాన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్... మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో కొరియా ఓపెన్‌లో బరిలోకి దిగనున్నాడు. మంగళవారం మొదలయ్యే ఈ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ తరపున మెరుున్ ‘డ్రా’లో శ్రీకాంత్‌తోపాటు సారుుప్రణీత్, అజయ్ జయరామ్, హెచ్‌ఎస్ ప్రణయ్ పాల్గొంటున్నారు.
గాయాల నుంచి కోలుకొని మళ్లీ రాకెట్ పట్టుకున్న పారుపల్లి కశ్యప్ తొలి రోజు క్వాలిఫరుుంగ్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్‌సలో 107వ స్థానానికి పడిపోరుున కశ్యప్ తొలి రౌండ్‌లో కో గ్యుంగ్ బో (దక్షిణ కొరియా)తో ఆడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే కశ్యప్ రెండో రౌండ్‌లో పనావిత్ తొంగ్‌నువామ్ (థాయ్‌లాండ్) లేదా కిమ్ మిన్ కీ (కొరియా)తో తలపడతాడు. ఒకవేళ కశ్యప్ మెరుున్ ‘డ్రా’కు అర్హత సాధిస్తే తొలి రౌండ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ తియాన్ హువీ (చైనా) ప్రత్యర్థిగా ఉంటాడు.
బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెరుున్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో వోంగ్ వింగ్ కీ విన్సెంట్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)తో ప్రణయ్; సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో సారుుప్రణీత్; జియోన్ హయెక్ జిన్ (కొరియా)తో జయరామ్ ఆడతారు.